Published : Nov 04, 2025, 03:36 PM ISTUpdated : Nov 04, 2025, 03:51 PM IST
WPL 2026: ముంబై ఇండియన్స్ 2026 మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ తో పాటు ఐదురుగు కీలక ప్లేయర్లను జట్టుతోనే ఉంచుకోనుంది. ప్రత్యర్థి జట్లకు దడపుట్టించే ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్ (MI) మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభం నుంచే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో 2023లో తొలి సీజన్‌లోనే టైటిల్ గెలుచుకున్నముంబై.. 2025లో మళ్లీ విజేతగా నిలిచింది. మూడేళ్లలో రెండుసార్లు ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ముంబై జట్టు ఒక బలమైన ఫ్రాంచైజీగా గుర్తింపు పొందింది.
2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరోసారి దిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి రెండవ టైటిల్ దక్కించుకుంది. నాట్ స్కివర్-బ్రంట్, అమీలియా కెర్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.
27
WPL 2026 మెగా వేలం క్రమంలో కొత్త ఉత్సాహం
భారత మహిళల జట్టు ప్రపంచకప్ 2025లో చారిత్రక విజయం సాధించిన తర్వాత డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంపై అంచనాలు పెరిగాయి. నవంబర్ 5 వరకు రిటెన్షన్ గడువు ఉండగా, అన్ని ఫ్రాంచైజీలు భారత ఆటగాళ్ల విలువను అంచనా వేస్తున్నారు. విజేత మైండ్‌సెట్, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అధిక డిమాండ్‌లో ఉన్నారు.
ముంబై ఇండియన్స్ తమ బలమైన కోర్‌ను కొనసాగిస్తూ ఐదు ఆటగాళ్లను రిటైన్ చేయనుంది. వీరిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు.
37
1. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత కెప్టెన్, బ్యాటర్)
హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై జట్టుకు తప్పనిసరి రిటెన్షన్. ఆమె నాయకత్వం ముంబై ఫ్రాంచైజీకి రెండు టైటిళ్లను అందించింది. మిడిల్ ఓవర్లలో స్థిరమైన బ్యాటింగ్, ఒత్తిడిలోనూ కూల్ గా ఆడగల సత్తా ఆమె ప్రత్యేకత. ప్రపంచకప్ విజయానంతరం ఆమె ఫ్యాన్ బేస్ మరింతగా పెరిగింది. 2025 సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 302 పరుగులు చేసి, 5 హాఫ్ సెంచరీలు సాధించింది.
ఇంగ్లాండ్‌కు చెందిన నాట్ స్కివర్-బ్రంట్ ముంబై జట్టులో అత్యంత ప్రభావవంతమైన విదేశీ ఆటగాళ్లలో ఒకరు. డబ్ల్యూపీఎల్ 2025లో ఆమె ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంది. ఆల్ రౌండ్ గా దుమ్మురేపుతూ 523 పరుగులు, 12 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో యాంకర్ పాత్రతో పాటు వేగవంతమైన బౌలింగ్‌తో జట్టుకు మద్దతు ఇచ్చింది. ఆమెను నిలుపుకోవడం ముంబైకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం.
57
3. అమేలియా కెర్ (విదేశీ ఆల్‌రౌండర్)
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ కూడా ముంబై జట్టుకు తప్పనిసరి రిటెన్షన్. 2025 సీజన్‌లో 18 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకుంది. లెగ్ స్పిన్‌తో మధ్య ఓవర్లలో ఆధిపత్యం చూపడమే కాక, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో వేగంగా రన్స్ చేయగల సామర్థ్యం ఉంది. ఆమె జట్టుకు భవిష్యత్తు ఆస్తిగా నిలుస్తోంది.
67
4. అమన్‌జోత్ (భారత ఆల్‌రౌండర్)
అమన్‌జోత్ ఒక అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా ముంబై జట్టులో కొనసాగనుంది. రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌గా, లోయర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో పవర్ హిట్టర్‌గా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె 2025 సీజన్‌లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు గెలుచుకుంది. 14 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవంతో, ఆమె రిటెన్షన్ ముంబైకి లోకల్ పవర్ ను కొనసాగించడంలో సహాయపడుతుంది.
జి. కమలిని ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాలో ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్. ఆమె డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలు గా డెబ్యూ చేసింది. 2025 వేలంలో ₹1.6 కోట్లు దక్కించుకున్న ఆమె లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా భవిష్యత్తు స్టార్ గా ఎదుగుతోంది. రిటెన్షన్ విలువ ₹50 లక్షలు మాత్రమే ఉండడం ఆమెను ఆర్థికంగా ప్రయోజనకరమైన ఎంపికగా నిలుస్తోంది.