SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2025 సీజన్‌ను సాదాసీదాగా ముగించింది. స్పిన్, పేస్ బౌలింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. 2026 వేలంలో రషీద్ ఖాన్, రవి బిష్ణోయ్, టీ నటరాజన్ వంటి కీలక ఆటగాళ్లపై దృష్టి సారించి జట్టును బలోపేతం చేసుకోవడం SRH ప్రధాన లక్ష్యం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2025 సీజన్‌ను ఉత్కంఠగా ప్రారంభించి, అదే ఉత్సాహంతో ముగించింది. అయితే, తొలి మ్యాచ్ తర్వాత పలు మ్యాచ్ లు నిరాశపరిచింది SRH. సీజన్ చివరి దశలో బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనతో కొంత ప్రతికూలతను తగ్గించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ వంటి బ్యాట్స్‌మెన్ చివరిలో బాగా ఆడి, వచ్చే సీజన్‌లో తమ రిటెన్షన్ అవకాశాలను మెరుగుపరుచుకున్నారు.
25
బౌలింగ్ విభాగంలో లోపాలు
జట్టును నిశితంగా పరిశీలిస్తే, SRH ప్రధానంగా బౌలింగ్ విభాగంలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బౌలింగ్ లైనప్ సెట్ కావడానికి చాలా సమయం పట్టింది. ప్రారంభంలో సిమర్జీత్ సింగ్, మహమ్మద్ షమీలతో ప్రయోగించినా, వారి పేలవ ఫామ్ కారణంగా బౌలింగ్ సెట్ కాలేదు. స్పిన్ డిపార్ట్‌మెంట్ కూడా గణనీయంగా బలహీనంగా ఉంది. జషన్ అన్సారీ కొన్ని వికెట్లు తీసినా, ప్రమాదకరంగా కనిపించలేదు. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ వంటి స్పిన్నర్లకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.
35
స్పిన్ విభాగం చాలా ముఖ్యం..
స్పిన్ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేసుకోవడం SRHకు అత్యవసరం. గుజరాత్ టైటాన్స్‌లో రాణిస్తున్న రషీద్ ఖాన్(14 మ్యాచ్‌లలో 9 వికెట్లు, 10 ఎకానమీ) గనుక విడుదల అయితే, SRH అతడిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే, జట్టు వద్ద పర్స్ విలువ తక్కువగా ఉండటం ఒక సవాలు. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ రిటెన్షన్లకే దాదాపు 75 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. రవి బిష్ణోయ్ కూడా ఈ సీజన్‌లో నిరాశపరిచాడు(11 మ్యాచ్‌లలో 9 వికెట్లు, 11 ఎకానమీ), అతను కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోవడం SRH స్పిన్ లోటును పూరించగలదు.
బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. వీరందరినీ నిలుపుకోవాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. అయితే, హెన్రిచ్ క్లాసెన్‌కు 23 కోట్లు, ప్యాట్ కమిన్స్‌కు 18 కోట్లు, ఇషాన్ కిషన్‌కు 11 కోట్లకు పైగా, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లకు చెరో 14 కోట్లు వెచ్చించడంతో జట్టు పర్స్ విలువ చాలా తగ్గిపోయింది. ఇది ఇతర ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయడంలో ఆటంకం కలిగించవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే, ప్యాట్ కమిన్స్ ఓపెనింగ్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇషాన్ మలింగ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
55
OG బౌలర్ బ్యాక్..!
నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ రాణించి, జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జైదేవ్ ఉనద్కత్ తక్కువ ధరకు ఎక్కువ లాభాన్ని అందించాడు. హర్షల్ పటేల్ వికెట్లు తీసినా, పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. బ్రైడన్ కార్స్ లేదా మల్డర్(వియాన్ ముల్డర్) లో ఒకరు జట్టులో కొనసాగవచ్చు. ఫాస్ట్ బౌలింగ్‌లో స్వింగ్, యార్కర్ డెలివరీలతో కూడిన డేంజరస్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి మయాంక్ యాదవ్ గనుక విడుదల అయితే, అతడు SRHకు మంచి ఎంపిక కాగలడు. భువనేశ్వర్ కుమార్ RCB తరపున బాగా ఆడుతున్నందున విడుదల అయ్యే అవకాశం లేదు. అయితే, టీ నటరాజన్ 10.75 కోట్లకు ఢిల్లీ జట్టులో ఉండి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, అతను విడుదల అయ్యే అవకాశం 100 శాతం ఉంది. SRH అతడిని 4-5 కోట్ల రూపాయలకు తిరిగి తీసుకోవచ్చు. మొత్తం మీద, SRH 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వేలంలోకి వెళ్లే అవకాశం ఉంది.