Mumbai Indians: ప్రపంచకప్ హీరో.. ఐపీఎల్‌లో జీరో.? బుమ్రా పేలవ ప్రదర్శన వెనుక షాకింగ్ నిజాలు!

Published : Apr 16, 2026, 05:55 PM IST

Mumbai Indians: టీ20 ప్రపంచకప్ 2026లో తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన జస్ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఈ స్టార్ పేసర్…

PREV
15
వికెట్ల కరవులో యార్కర్ కింగ్

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లను తన యార్కర్లతో బోల్తా కొట్టించే బుమ్రా, ఈ సీజన్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 15 ఓవర్లు వేసిన బుమ్రా, 123 పరుగులు సమర్పించుకున్నారు. సాధారణంగా తక్కువ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసే ఆయన, ఈసారి 8.20 ఎకానమీతో పరుగులు ఇస్తున్నారు. ప్రపంచకప్‌లో 14 వికెట్లతో చెలరేగిన బౌలర్, ఐపీఎల్‌లో సాధారణ బౌలర్‌లా మారిపోవడం వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

25
అలసట, పని భారం

అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్ క్రికెట్ మధ్య బుమ్రాకు తగినంత విశ్రాంతి లభించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా విభిన్నమైన బౌలింగ్ శైలి(యాక్షన్) వల్ల ఆయన శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వరుసగా మ్యాచ్‌లు ఆడటం వల్ల కలిగే అలసట బంతుల ఖచ్చితత్వంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అత్యంత ఒత్తిడి మధ్య బౌలింగ్ చేయడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా బుమ్రా అలసిపోతున్నట్లు కనిపిస్తోంది.

35
బ్యాటర్ల కొత్త వ్యూహాలు

నేటి ఆధునిక క్రికెట్‌లో బ్యాటర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బౌలర్ల బలహీనతలను ఇట్టే పసిగడుతున్నారు. బుమ్రా వేసే యార్కర్ల నుండి తప్పించుకోవడానికి, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి బ్యాటర్లు కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. 

45
బౌలింగ్ శైలిలో కొత్తదనం..

ప్రత్యర్థులు తమ వ్యూహాలను మార్చుకుంటున్న తరుణంలో, బుమ్రా తన బౌలింగ్ శైలిలో కొత్తదనం చూపడంలో వెనుకబడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

55
త్వరగా ఫామ్‌లోకి రావడం..

ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించే బుమ్రా త్వరగా ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ఎంతో అవసరం. తన పని భారాన్ని క్రమబద్ధీకరించుకుంటూ, పాత పదునైన బౌలింగ్‌తో బుమ్రా మళ్ళీ ఎప్పుడు వికెట్లు తీస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories