IPL 2026: ఆర్సీబీ టాప్.. కేకేఆర్ కష్టాల్లో.! ప్లేఆఫ్స్ కోసం ఏ జట్టు ఎన్ని గెలవాలో తెలుసా?

Published : Apr 16, 2026, 05:29 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఆర్సీబీ ముందజలో ఉండగా.. ముంబై, కేకేఆర్ వంటి దిగ్గజ జట్లు గండం గట్టెక్కడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. రాబోయే మ్యాచ్‌లు ప్రతి జట్టు భవితవ్యాన్ని తేల్చనున్నాయి. 

PREV
15
బెంగళూరు జైత్రయాత్ర

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ విజయంతో మొదలైన వీరి జోరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేర్చింది. తాజా విజయాల నేపథ్యంలో ప్లే ఆఫ్స్ చేరడానికి ఏ ఏ జట్లు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలో ఆసక్తికరంగా మారింది

25
సురక్షిత స్థితిలో బెంగళూరు, రాజస్థాన్

ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ జట్లు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలు సాధిస్తే సరిపోతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వీరు తమ మిగిలిన పది మ్యాచ్‌లలో ఐదు గెలవాల్సి ఉంటుంది.

35
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇతర జట్ల పరిస్థితి

సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసిన SRH, ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో కనీసం ఆరు గెలవాలి. ఢిల్లీ, గుజరాత్, లక్నో, చెన్నై జట్ల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఈ జట్లు కూడా తమ తదుపరి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధిస్తేనే ముందడుగు వేయగలవు.

45
ముంబై ఇండియన్స్ తడబాటు

ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తీవ్రంగా తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన ముంబై, ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన పది మ్యాచ్‌లలో ఏడింటిలో గెలవాల్సి ఉంటుంది.

55
కేకేఆర్ కష్టాలు

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అన్నింటికంటే దారుణంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలవని కేకేఆర్, వర్షం కారణంగా వచ్చిన ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. వీరు ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది గెలవాలి, ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories