హ్యాట్రిక్ మెడల్ కు అడుగుదూరంలో మనుభాకర్.. 24 మీటర్ల షూటింగ్ లో ఫైనల్ పోరుకు రెడీ

First Published | Aug 2, 2024, 6:30 PM IST

Paris Olympics 2024-Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ హ్యాట్రిక్ మెడల్ సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మహిళల షూటింగ్ విభాగంలో రెండు మెడల్స్ సాధించిన మనుభాకర్ 25 మీటర్ల పిస్టల్ రౌండ్‌లో ఫైనల్ కు చేరుకుంది. 

Manu Bhaker

Paris Olympics 2024-Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త షూట‌ర్ మ‌ను భాక‌ర్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే భార‌త్ రెండు మెడ‌ల్స్ గెలిచిన ఈ షూట‌ర్ మ‌రో మెడ‌ల్ ను సాధించ‌డానికి సిద్ధ‌మైంది. 22 ఏళ్ల షూటర్ మను భాకర్ మ‌రో మెడ‌ల్ ఈవెంట్ లో ఫైనల్‌కు చేరుకుంది.

మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె రెండో స్థానంలో నిలిచి ఫైనల్ కు చేరుకుంది. ఇక్క‌డ మెడ‌ల్ సాధిస్తే మ‌ను భాక‌ర్ స‌రికొత్త హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒకే ఒలింపిక్ లో భార‌త్ త‌ర‌ఫున మూడు మెడ‌ల్స్ ఎవ‌రూ సాధించ‌లేదు. 

Latest Videos


మ‌ను భాక‌ర్ ఇప్ప‌టికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు సాధించి రెండు మెడ‌ల్స్ సాధించిన భార‌త అథ్లెట్ గా చ‌రిత్ర సృష్టించింది. అలాగే, మూడో మెడ‌ల్ సాధిస్తూ స‌రికొత్త హిస్ట‌రీ అవుతుంది.

మ‌ను భాక‌ర్ ఒలింపిక్స్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో సుమ షిరూర్ తర్వాత ఒలింపిక్ షూటింగ్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయ మహిళ మ‌నుభాక‌ర్. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కూడా మ‌ను భాక‌ర్.

అలాగే, ఎయిర్ పిస్టల్ విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్. ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్. 

Manu Bhaker and Sarabjot Singh

రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత షూటర్ మ‌ను భాక‌ర్. ఒలింపిక్స్ లో టీమ్ మెడల్ సాధించిన తొలి భారత షూటింగ్ జంట (మను భాక‌ర్, సరబ్ జ్యోత్ సింగ్). వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్. ఇంకో మెడ‌ల్ సాధిస్తే హ్యాట్రిక్ తో హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంది. 

మరే ఇతర భారతీయ షూటర్ ఒకే ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫైనల్‌కు చేరుకోలేదు. గతంలో అభినవ్ బింద్రా మాత్రమే మూడు గేమ్‌లలో భారత్ తరఫున మూడు ఒలింపిక్ షూటింగ్ ఫైనల్స్ చేరుకున్నాడు.
 

click me!