Paris Olympic Medal Winners Gift Box : గ్లోబల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గా పేరొందిన ఒలింపిక్స్ కు ఈసారి పారిస్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ విశ్వక్రీడలకు ప్రపంచ నలుమూలల నుంచి 200 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.
ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా ఒలింపిక్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను బంగారు, రజత, కాంస్య పతకాలతో సత్కరిస్తున్నారు.
అవార్డుల వేడుకలో పతకం గెలుచుకున్న అథ్లెట్లకు మెడల్ తో పాటు ఒక గిఫ్ట్ బాక్స్‌ను కూడా అందిస్తున్నారు. అయితే, పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఏముంది అనేదనే విషయం స్పోర్ట్స్ లవర్స్ కు మరింత ఆసక్తిని పెంచింది.
మెడల్ విన్నర్స్ కు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో 2024 పారిస్ ఒలింపిక్స్ అధికారిక పోస్టర్ ఉంది. దీనిని ప్రముఖ కళాకారుడు ఉగో గట్టోని రూపొందించారు. ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడానికి గట్టోని చాలా సమయం తీసుకున్నారని సమాచారం.
విజేతలకు పారిస్ ఒలింపిక్స్ అధికారిక చిహ్నం ఫ్రైజ్‌తో పాటు మెడల్, పోస్టర్‌ను బహుకరిస్తారు. ఈ ఫ్రైజ్ ప్లూషీ ఫ్రాన్స్ వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది ఫ్రెంచ్ విప్లవానికి ప్రతీకగా ఉంటుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ పతకాన్ని గుర్తు చేస్తూ, ఈ హస్తకళలు డౌడౌ & కంపెనీ కర్మాగారంలో దాని నైపుణ్యం, అధిక నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. ప్యారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి బ్రెయిలీ లిపితో కూడిన ప్రత్యేక ప్లస్సీని అందించాలని కూడా నిర్వాహకులు నిర్ణయించారు.
పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చిన మిస్టీరియస్ గిఫ్ట్ బాక్స్‌లో ఖరీదైన కళాఖండాలు, పోస్టర్ బహుమతులు ఫ్రాన్స్ సాంస్కృతిక గొప్పతనాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు మెమెంటోగా వీటిని అందిస్తున్నారు.