టీ20 ప్రపంచకప్ ముందే పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ టోర్నీకి దూరం.!

Published : Jan 01, 2026, 08:32 PM IST

Shaheen Afridi: టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌కు పెద్ద షాక్ తగిలింది. స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మోకాలి గాయంతో ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో గాయపడటంతో, అతను వరల్డ్ కప్‌లో.. 

PREV
15
పాక్‌కు ఎదురుదెబ్బ..

టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మోకాలి గాయంతో ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆడుతుండగా గాయపడటంతో, రాబోయే వరల్డ్ కప్‌లో అతను ఆడే అవకాశాలపై తీవ్రమైన నీలి నీడలు కమ్ముకున్నాయి. గతంలోనూ ఇలాంటి మోకాలి గాయంతో ఇబ్బంది పడిన షాహీన్, మళ్లీ అదే సమస్యతో జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాడు.

25
స్వదేశానికి పయనం..

అఫ్రిదికి మోకాలి గాయం కాకముందే, జనవరి 7 నుంచి 11 వరకు శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిని ఎంపిక చేయలేదు. అయితే, బ్రిస్బేన్ హీట్ తరఫున బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తూ షాహీన్‌కు మోకాలి గాయమైంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన పీసీబీ, అఫ్రిదిని వెంటనే లాహోర్‌లోని హై పర్ఫార్మెన్స్ సెంటర్‌కు పిలిపించింది.

35
లాహోర్‌లో చికిత్స..

లాహోర్‌లో అతనికి అవసరమైన వైద్య చికిత్స, రిహాబిలిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. క్రికెట్ ఆస్ట్రేలియాతో జరిపిన చర్చల అనంతరం షాహీన్‌కు పూర్తి విశ్రాంతి అవసరం అని ప్రాథమికంగా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. పీసీబీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, షాహీన్ గాయం తీవ్రత ఎంత మేరకు ఉంది, అతడు ఎంత కాలం విశ్రాంతి తీసుకోవాలో బోర్డు వైద్యులతో సమావేశం తర్వాతే స్పష్టత వస్తుంది.

45
భవిష్యత్తు షెడ్యూల్‌పై తీవ్ర ప్రభావం..

ఈ గాయం అతని భవిష్యత్ షెడ్యూల్ ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. బీబీఎల్ ను మధ్యలోనే వదిలి వెళ్లాల్సి రావడంపై షాహీన్ కూడా స్పందించాడు. నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. "బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడటం నాకు చాలా ఆనందం ఇచ్చింది. కానీ సీజన్ పూర్తి చేయలేకపోవడం బాధగా ఉంది. త్వరలోనే మళ్లీ మైదానంలోకి వస్తానని ఆశిస్తున్నాను," అని షాహీన్ పేర్కొన్నాడు.

55
బీబీఎల్ సీజన్ ఇలా..

ఈ సీజన్లో షాహీన్ బ్రిస్బేన్ హీట్ తరఫున కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. తొలి మ్యాచ్‌లోనే వరుసగా రెండు ఫుల్ టాస్ బంతులు వేయడంతో ఓవర్ మధ్యలోనే అతడిని తప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గతంలోనూ షాహీన్ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. 2021-22లో శ్రీలంకలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని దాదాపు ఏడాదిపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories