Hardik Pandya: టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి రావాలని అభిప్రాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా టెస్టులకు దూరమైన పాండ్యా, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్, అద్భుత ఫామ్‌లో ఉన్నాడని..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి రావాలని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యాకు టెస్టు జట్టులో పునరాగమనం చేసే సత్తా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. 2025 సంవత్సరం టీమిండియాకు టెస్టుల్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, సౌత్ ఆఫ్రికాపై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.
25
భారత్ వైట్ వాష్..
సౌత్ ఆఫ్రికాపై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
35
పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ..
రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపాడు. పాండ్యా ప్రస్తుతం కేవలం వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగ్రేట్రం చేసిన పాండ్యా, ఇప్పటివరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరిసారిగా పాండ్యా 2018లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే, ఆడిన 11 టెస్టుల్లోనూ 532 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.
పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తే అతడికి ఏడో స్థానం సరిగ్గా సరిపోతుందని, భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాయని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. పాండ్యా ఒక అద్భుతమైన ఆటగాడని, ఒకవేళ తాను ఆడతానని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను సాధిస్తానని పాండ్యా చెబితే, సెలెక్టర్లు గానీ, బోర్డు పెద్దలు గానీ నో చెప్పరని ఊతప్ప అన్నాడు. ఎందుకంటే అతడు సూపర్ ఫామ్‌తో పాటు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 12 నుంచి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు.
55
ఎవరూ 20 ఓవర్లకు మించి..
ప్రస్తుతం జట్టులోని మిగతా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లలో ఎవరూ 20 ఓవర్లకు మించి బౌలింగ్ చేయడం లేదని ఊతప్ప గుర్తు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కేవలం 12 ఓవర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా అంతకు మించి ఒకటి రెండు ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. అతడు రీ-ఎంట్రీ ఇస్తే బాగుంటుందని, అయితే ఇది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఊతప్ప స్పష్టం చేశాడు.