లియోనెల్ మెస్సీకి రూ.3600 కోట్ల ఆఫర్! పీఎస్‌జీతో తెగతెంపులు, రొనాల్డో బాటలో సౌదీ టీమ్‌కి...

First Published | May 9, 2023, 8:32 PM IST

ఐపీఎల్‌లో ఒక్క క్రికెటర్ కోసం రూ.18 కోట్లు పెడితేనే... అబ్బో అనుకుంటాం. అయితే ఫుట్‌బాల్ లీగుల్లో ఒక్కో ప్లేయర్ కోసం వేల కోట్లు పెట్టడానికి ఏ మాత్రం వెనకాడవు క్లబ్స్. తాజాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్, సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఓ సౌదీ అరేబియా క్లబ్ రూ.3600 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైనట్టు సమాచారం..

Lionel Messi Laureus Award

లీగ్1 ఫుట్‌బాల్ లీగ్‌లో పారిస్ సెయింట్ జెర్మన్ తరుపున ఆడుతున్న లియోనెల్ మెస్సీ, చెప్పా పెట్టకుండా సౌదీ అరేబియా టూర్‌కి వెళ్లాడు. ఈ కారణంగా మెస్సీపై రెండు వారాల సస్పెన్షన్ విధించింది పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్...

లియోనెల్ మెస్సీ, సౌదీ అరేబియా ట్రిప్‌కి వెళ్లడానికి కారణం వేరే ఉందని సమాచారం. బార్సిలోనా క్లబ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పారిస్ సెయింట్ జెర్మన్‌తో రెండేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు లియోనెల్ మెస్సీ...
 


Lionel Messi

వచ్చే నెలతో ఈ కాంట్రాక్ట్ ముగియనుంది. దీంతో సౌదీ అరేబియాకి చెందిన ఓ క్లబ్‌, లియెనెల్ మెస్సితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్లబ్‌తో చర్చలు జరిపేందుకే లీగ్1 మధ్యలో మెస్సీ, సౌదీ ట్రిప్‌కి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి..

Messi Qatar World Cup

పారిస్ సెయింట్ జెర్మన్ కాంట్రాక్ట్ ప్రకారం 30 మిలియన్ యూరోలు (దాదాపు రూ.2700 కోట్ల 80 లక్షలకు పైగా) చెల్లిస్తోంది.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్, మెస్సీకి ఏకంగా 40 మిలియన్ల యూరోలు (దాదాపు 3600 కోట్లకు పైగా) చెల్లించనుంది.. 

Messi-Ronaldo

పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో, ఇప్పటికే సౌదీ అరేబియాకి చెందిన అల్ నజర్‌ క్లబ్‌తో 2023 జనవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు 400 మిలియన్ల యూరోలు చెల్లించనుంది అల్ నజర్ క్లబ్...

Latest Videos

click me!