సచిన్, ధోనీలాగే నీ చుట్టూ కెమెరాలు ఉంటాయ్ చూస్కో! మ్యాచ్ అయ్యాక... విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి సలహా...

First Published May 9, 2023, 7:17 PM IST

రవిశాస్త్రి, టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నన్ని రోజులు విరాట్ కోహ్లీ చెప్పిందే శాసనం, ఆడిందే ఆటగా సాగింది. భారత జట్టు మ్యాచులు ఓడిపోయిన ప్రతీసారీ, కోహ్లీ కంటే ఎక్కువగా రవిశాస్త్రిపైనే ట్రోల్స్ వచ్చేవి...

Virat Kohli-Rohit Sharma

2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక టీమిండియా కెప్టెన్సీ కోల్పోయి, అష్టకష్టాలు అనుభవించాడు విరాట్ కోహ్లీ...

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి తిరిగి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ, 2023 ఏడాది కూడా సెంచరీ ఫామ్‌ని కొనసాగించాడు. మూడేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ అందుకున్న విరాట్, ఐపీఎల్ 2023 సీజన్‌లో 6 హాఫ్ సెంచరీలు సాధించాడు..

Latest Videos


లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్‌తో ప్రవర్తించిన తీరు, గౌతమ్ గంభీర్‌తో జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్ అయ్యింది. ఈ గొడవపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

PTI PhotoShailendra Bhojak) (PTI04_15_2023_000132B)

‘గత వారంలో జరిగిన కొన్ని సంఘటనల తర్వాత ధోనీ, కోహ్లీలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ధోనీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను పక్కా ప్రొఫెషనల్...
 

dhoni pathirana

ధోనీ ఎక్కడుంటే అక్కడ కెమెరాలు ఉంటాయనే విషయం అతనికి తెలుసు. క్రికెట్‌ రంగానికి అతను చేసిన సేవలకు దక్కిన గుర్తింపు అది..

సచిన్ టెండూల్కర్ కూడా అంతే. సచిన్ ఎక్కడుంటే కెమెరాలన్నీ అటు వైపే తిరుగుతాయి. విరాట్ కోహ్లీ కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రతీ నిమిషం గుర్తుంచుకోవాలి..

Virat Kohli

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే వరకూ కెమెరాలన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మ్యాచ్ అయిపోయాక కెమెరాలు నన్ను చూస్తున్నాయనే మైండ్ సెట్ ఉంటే చాలు, మన మాటలు, చేతలు కంట్రోల్‌లో ఉంటాయి...

కెమెరా ద్వారా మనం జనాల మనసులు గెలుచుకోవచ్చు. ఎందరికో ఆదర్శప్రాయంగా మారొచ్చు. అలాగే ఒక్క రోజులో విలన్ అయిపోవచ్చు. కాబట్టి కోహ్లీ కాస్త జాగ్రత్త పడితే బెటర్...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి..
 

click me!