ట్రోఫీ గెలిచాక ఇంకో ఏడాది ఆడతా! ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి సురేష్ రైనాతో ధోనీ మాటలు...

Published : May 09, 2023, 06:23 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి నాలుగేళ్లుగా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2020 ఐపీఎల్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన ధోనీ, 2023 సీజన్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని జోరుగా ప్రచారం జరుగుతోంది..

PREV
16
ట్రోఫీ గెలిచాక ఇంకో ఏడాది ఆడతా! ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి సురేష్ రైనాతో ధోనీ మాటలు...

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘నేను నా కెరీర్ చివరి ఫేజ్‌లో ఉన్నా... అన్నింటినీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేసి, రిటైర్మెంట్ గురించి హింట్స్ ఇచ్చాడు ధోనీ...

26
PTI Photo/Swapan Mahapatra)(PTI04_23_2023_000413B)

లీగ్ మధ్యలో రిటైర్మెంట్ గురించి కామెంట్లు చేయడం సరికాదని చెప్పిన ధోనీ, కేకేఆర్‌తో కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో ‘వీళ్లంతా తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్ జెర్సీలో వస్తారు. నాకు ఘనమైన ఫేర్‌వెల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఎస్‌కే జెర్సీల్లో వచ్చారు... ఆ అభిమానానికి ధన్యుడిని’ అంటూ వ్యాఖ్యానించాడు..

36

అయితే తాజాగా ఆఖరి ఐపీఎల్ సీజన్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారని డానీ మోరిసన్ అడిగిన ప్రశ్నకు.. ‘ఇది నా ఆఖరి ఐపీఎల్‌ అని మీరే డిసైడ్ చేసేశారు. నేనింకా చెప్పలేదు’ అంటూ వ్యాఖ్యానించాడు ధోనీ. దీంతో ధోనీ, వచ్చే సీజన్‌లో కూడా ఆడబోతున్నాడా? అనే అనుమానాలు రేగాయి..

46

తాజాగా మాహీ బెస్ట్ ఫ్రెండ్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా... ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మహేంద్ర సింగ్ ధోనీ తనతో చెప్పిన వ్యాఖ్యలతో బయటపెట్టాడు. ‘ట్రోఫీ గెలిచిన తర్వాత ఓ ఏడాది ఆడతా...’ అని ధోనీతో తనతో చెప్పినట్టు కామెంట్ చేశాడు సురేష్ రైనా...
 

56
MS Dhoni

రైనా మాటలను బట్టి చూస్తుంటే ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిస్తే, వచ్చే ఏడాది కూడా ధోనీ ఆడతాడు. ఒకవేళ సీఎస్‌కే ఈసారి టైటిల్ గెలవకపోతే? వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడి, టైటిల్ గెలిచిన తర్వాత ఇంకో ఏడాది ఆడతాడా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు మాహీ ఫ్యాన్స్.. 

66

లేక ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవబోతుందని ఇప్పటికే అందరికీ తెలిసిందా? ధోనీకి ఘనమైన ఫేర్‌వెల్ ఇవ్వడం కోసం స్క్రిప్టుని బలంగా ఆ టీమ్‌కి ఫేవర్‌గా రాసి పెట్టారా? అంటూ రైనా కామెంట్లలో విపరీత అర్థాలను వెతుకుతున్నారు మరికొందరు అభిమానులు..

Read more Photos on
click me!

Recommended Stories