ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించిన ల‌క్ష్య‌సేన్.. మొద‌టి భారత షట్లర్‌గా రికార్డు

First Published | Aug 2, 2024, 11:36 PM IST

Paris Olympics - Lakshya Sen : పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో మెడ‌ల్ సాధించ‌డానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు భారత ఆటగాడు లక్ష్య సేన్. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 19-21, 21-15, 21-12తో చైనీస్ తైపీకి చెందిన చౌ టియన్ చెన్‌ను ఓడించి సెమీస్ కు చేరుకుని రికార్డు సృష్టించాడు. 
 

Lakshya Sen

Paris Olympics - Lakshya Sen : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త్ మ‌రో మెడ‌ల్ కు అడుగు దూరంలోకి చేరింది. ఇప్పటికే రికార్డుల మోత మోగించిన‌ భార‌త స్టార్ షట్ల‌ర్ ల‌క్ష్య‌సేన్ మ‌రో చ‌రిత్ర సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పతకానికి ఒక విజయం దూరంలో ఉన్న భారత ఆటగాడు లక్ష్య సేన్ సెమీ-ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష ఆటగాడిగా రికార్డు సాధించాడు. 

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 19-21, 21-15, 21-12తో చైనీస్ తైపీకి చెందిన చౌ టియన్ చెన్‌ను ఓడించి సెమీ-ఫైనల్ కు చేరుకున్నాడు. భారత్ తరఫున సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం (2012), పీవీ సింధు రజత పతకం (2016), కాంస్య పతకం (2020) గెలుచుకున్నారు. ఇప్పుడు బ్యాడ్మింట‌న్ లో భార‌త్ కు మెడ‌ల్ అందించ‌డానికి లక్ష్య సేన్ ముందుకు సాగుతున్నాడు. 

Latest Videos


క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠ‌గా సాగింది. విజేత ఎవరన్నది చివరి సెట్‌లో తేలింది. తొలి సెట్‌లో లక్ష్య సేన్ 19-21తో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయాడు. దీని తర్వాత భారత షట్లర్ మిగిలిన వ‌రుస‌గా రెండు సెట్‌లలో ప్రత్యర్థిని ఓడించి అద్భుత పునరాగమనంతో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. రెండో సెట్‌ను 21-15తో లక్ష్యసేన్ చేజిక్కించుకోగా, చివరి సెట్ ను 21-12తో గెలుచుకున్నాడు.

ఈ గెలుపుతో లక్ష్య సేన్ పారిస్‌లో చరిత్రను లిఖించారు. 22 ఏళ్ల షట్లర్ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడు. ప్యారిస్ గేమ్స్‌లో తైవాన్‌కు చెందిన 12వ సీడ్ చౌ టియెన్ చెన్‌ను లక్ష్యసేన్ ఓడించి సంచలన విజయం సాధించాడు.

click me!