ఉత్కంఠ మ్యాచ్..శ్రీలంక సూపర్ బౌలింగ్ తో కుప్పకూలిన భారత్.. తొలి వన్డే టై

First Published | Aug 2, 2024, 11:00 PM IST

IND vs SL 1st ODI Match Highlights : భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్‌లో  భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 
 

india, cricket

India vs Sri Lanka 1st ODI Match Highlights : భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ శుక్ర‌వారం ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో శ్రీలంక బౌల‌ర్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్ టైగా ముగిసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 230 పరుగులు చేసింది. తర్వాత శ్రీలంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి భారత్‌ను 230 పరుగులకే పరిమితం చేశారు.

india, cricket

ఒకానొక సమయంలో భారత్ బ్యాటింగ్ చూస్తుంటే మ్యాచ్ సులువుగా గెలిచేలా క‌నిపించింది. కానీ, భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఔట్ అయిన త‌ర్వాత ఆతిథ్య జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్  చేస్తూ భార‌త్ గెలుపును అడ్డుకున్నాడు. మ్యాచ్ ను టై చేశారు. 

Latest Videos


india, cricket, Gill

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణయం ఆ జట్టుకు బిగ్ షాకిచ్చింద‌నే చెప్పాలి. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసుకోవ‌డంతో ఆ జట్టు కష్టాల్లో ప‌డింది. అయితే, పాతుమ్ నిస్సంక (56 పరుగులు), లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దునిత్ వెల్లలాగే అజేయంగా 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడ‌టంతో శ్రీలంక జట్టు గౌరవప్రదమైన స్కోరును అందుకోగలిగింది. 231 ప‌రుగుల స్వ‌ల్ప టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు తొలి వికెట్‌కు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ 75 పరుగులు జోడించారు. గిల్ (16 పరుగులు) రూపంలో భారత్‌కు తొలి దెబ్బ తగిలి. గిల్ ఔట్ త‌ర్వాత భార‌త బ్యాటింగ్ కాస్త నెమ్మ‌దించింది. 

Rohit Sharma, cricket

అయితే, కెప్టెన్ రోహిత్  శ‌ర్మ మ‌రోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 58 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ పెవిలియ‌న్ కు చేరాడు. ఆ త‌ర్వాత విరాట్ కోహ్లీ (24 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (23 పరుగులు) కూడా బిగ్ స్కోర్లు చేయ‌లేక‌పోయారు. కేఎల్ రాహుల్ (31 పరుగులు), అక్షర్ పటేల్ (33 పరుగులు) భాగస్వామ్యంతో భారత్ విజయంపై ఆశలు మళ్లీ చిగురించాయి కానీ, వీరిద్దరినీ ఔట్ చేసి మ‌ళ్లీ హసరంగా, అసలంకలు మ్యాచ్ ను శ్రీలంక లైన్ లోకి తీసుకెళ్లారు.

India , Cricket, virat kohli

చివర్లో, శివమ్ దూబే (25 పరుగులు) భారత్‌ను విజయతీరాలకు చేర్చే విధంగా బ్యాటింగ్ చేశాడు కానీ, అత‌ను ఔట్ అయిన త‌ర్వాత పూర్తిగా మ్యాచ్ స్వ‌రూపం మారిపోయింది. ఎందుకంటే ఇది 9వ వికెట్. మ‌రో ఒక్క ప‌రుగు కావాల్సిన స‌మ‌యంలో చివరి బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ తొలి బంతికే ఔట్ కావడంతో మ్యాచ్ టై అయింది.

India , Cricket, virat kohli

ఆరంభంలో అద్భుతంగా ఆడినా ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించలేకపోయింది. శ్రీలంక బౌలర్లు అద్భుతాలు చేసి భారత్‌ను 230 పరుగులకే పరిమితం చేశారు. ఈ సిరీస్‌లో భాగంగా ఆగస్టు 4న జరిగే రెండో మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

ఇరు జట్ల ప్లేయింగ్-11

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జెనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, అకిలా ధనంజయ్, మహ్మద్ షిరాజ్, అసిత ఫెర్నాండో.

click me!