Published : Mar 14, 2026, 12:32 PM ISTUpdated : Mar 14, 2026, 01:01 PM IST
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మార్చి 14, 2026న అంటే ఇవాళ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికా చద్దాతో ఏడడుగులు వేయబోతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఈ వివాహం జరుగుతోంది. ఈ వేడుకకు క్రికెట్ తో పాటు ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు.
Kuldeep Yadav - Vanshika Chadha Wedding : ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడు, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. ఇవాళ (మార్చి 14, శనివారం) తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్‌ఫ్రెండ్ వంశికా చద్దాతో ఆయన పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్ ఉత్తరాఖండ్ ముస్సోరీలోని సవాయ్ హోటల్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ కాబోయే భార్య ఎవరు, ఏం చదివారు, ఎంత సంపాదిస్తారు..? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
25
కుల్దీప్ భార్యదీ యూపీనే...
కుల్దీప్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందినవాడు. అతడికి కాబోయే భార్య వంశిక కూడా ఇక్కడే పుట్టిపెరిగారు. ఆమె తన పాఠశాల విద్యను సొంత నగరం కాన్పూర్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లారు. వంశిక చదువులో ఎప్పుడూ ముందుండేవారు... అందుకు ప్రతిఫలంగా అద్భుతమైన ఉద్యోగం లభించింది.
35
ఎల్ఐసిలో పనిచేస్తున్న వంశిక..
వంశికా చద్దా ప్రస్తుతం భారతదేశపు నంబర్-1 ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో పనిచేస్తున్నారు. ఆమె అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) హోదాలో బ్రాంచ్ లెవల్ మేనేజ్‌మెంట్ పనులు చూసుకుంటారని సమాచారం. ఎల్ఐసి లో AAO ప్రారంభ జీతం నెలకు సుమారు రూ.1,07,000 నుండి రూ.1,26,000 మధ్య ఉంటుంది. దీనికి తోడు లక్షల్లో కమిషన్ కూడా వస్తుంది.
ఇలా కుల్దీప్ కు కాబోయే భార్య వంశికా చద్దా జీతం IAS, IPS అధికారుల కన్నా చాలా ఎక్కువ. ఏడో వేతన సంఘం ప్రకారం దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపిఎస్ లో కొత్తగా చేరే అధికారులకు ప్రాథమిక జీతం నెలకు రూ.56,100 ఉంటుంది. అన్ని అలవెన్సులు (DA, HRA, TA) కలుపుకుంటే చేతికి వచ్చే జీతం నెలకు సుమారు రూ.80,000 నుండి రూ.1,00,000 వరకు ఉంటుంది. కానీ వంశిక జీతం దీన్ని మించిపోయింది.
55
కుల్దీప్-వంశికది లవ్ మ్యారేజ్..
వంశికా చద్దా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు… అందుకే ఇతర క్రికెటర్ల గర్ల్ ప్రెండ్స్ లా ఎప్పుడూ మైదానంలో కనిపించలేదు. కానీ ఆమె కాబోయే భర్త కుల్దీప్ యాదవ్ మాత్రం తన ప్రొఫెషన్ కారణంగా ఎప్పుడూ మీడియాలో కనిపిస్తుంటారు. వీరిద్దరి ప్రేమకథ కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో మొదలైంది. ఉత్తరాఖండ్‌లో పెళ్లి బంధంతో వీరు జీవితాంతం ఒక్కటి కాబోతున్నారు.