హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేసే విషయంలో కేకేఆర్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జట్టులోని ఇతర భారతీయ పేసర్లు వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, ఆకాష్ దీప్‌లకు ఇది మంచి అవకాశమని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. "హర్షిత్ రాణా అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. కానీ ఇది వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాష్‌లకు తమ సత్తా నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం" అని కేకేఆర్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఐపీఎల్ 2026లో కేకేఆర్ మొదటి 4 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
• మార్చి 29: ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ (ముంబై) - రాత్రి 7:30
• ఏప్రిల్ 2: కేకేఆర్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతా) - రాత్రి 7:30
• ఏప్రిల్ 6: కేకేఆర్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా) - రాత్రి 7:30
• ఏప్రిల్ 9: కేకేఆర్ vs లక్నో సూపర్ జెయింట్స్ (కోల్‌కతా) - రాత్రి 7:30