తమ్ముడు విరాట్.! టెస్ట్ రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకో.. టీమిండియా పిలుస్తోంది

Published : Nov 28, 2025, 06:04 PM IST

Kris Srikkanth: భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు మళ్లీ విజయాలు సాధించాలంటే విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు. 

PREV
15
గడ్డు పరిస్థితిలో టెస్ట్ క్రికెట్

ప్రస్తుతం భారత టెస్ట్ క్రికెట్ జట్టు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా ఐదేళ్లపాటు టెస్ట్ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు, ఇప్పుడు సొంతగడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడానికి కూడా కష్టపడుతుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఇండియాలో భారత జట్టును ఎదుర్కోవాలంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు సైతం భయపడేవి.

25
ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయాడని..

అలాంటిది ఇప్పుడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టెస్ట్ సిరీస్‌లను ఘోరంగా ఓడిపోయింది. సిరీస్ ఓడిపోవడమే కాకుండా, కనీసం ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నంత కాలం ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయాడని అన్నారు.

35
'ఫెయిల్యూర్‌ కెప్టెన్' అంటూ గేలి చేసినవారే..

అతను ఒక 'ఫెయిల్యూర్‌ కెప్టెన్' అంటూ గేలి చేసిన వారే ఇప్పుడు అతనే తిరిగి కావాలంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు, టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తిరిగి బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయమై తీవ్రస్థాయిలో స్పందించారు. 'టీమ్ ఇండియా మళ్లీ టెస్ట్ క్రికెట్‌లో మునుపటిలా విజయాలు అందుకోవాలంటే విరాట్ కోహ్లీని వెనక్కి తీసుకోవాల్సిందే,' అని ఆయన స్పష్టం చేశారు.

45
దయచేసి రిటైర్మెంట్ వెనక్కి తీసుకో

'తమ్ముడు విరాట్, దయచేసి రిటైర్మెంట్ వెనక్కి తీసుకో. నువ్వు లేకపోతే నీ టీమ్ ఎలా ఓడిపోతోందో కాస్త చూడు. ఇకనైనా టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని టీంలోకి రా,' అంటూ శ్రీకాంత్ విరాట్ కోహ్లీకి విజ్ఞప్తి చేశారు. 

55
టీమ్‌ని ప్రక్షాళన చేయాల్సిన టైమ్ వచ్చింది

జట్టులో నెలకొన్న రాజకీయాలపై కూడా శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గౌతమ్ గంభీర్ నేను ఎవరు చెప్పినా వినను అనొచ్చు. కానీ నేను టీమ్ ఇండియాకి కెప్టెన్‌గా చేశాను. అలాగే సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా చేశాను. నాకు టీమ్ గురించి తెలుసు. టీమ్‌లోని రాజకీయాల గురించి కూడా తెలుసు. కాబట్టి టీమ్‌ని ప్రక్షాళన చేయాల్సిన టైమ్ వచ్చిందని అనిపిస్తోంది. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అందరికీ తెలుసు. రాజకీయాలు అన్నిసార్లు వర్కవుట్ కావు," అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories