KL Rahul: అదే మా కొంపముంచింది.. అందువల్లే మ్యాచ్ ఓడిపోయాం, ఓటమికి కారణం చెప్పిన కేఎల్ రాహుల్

Published : Dec 04, 2025, 05:57 PM IST

ODI Loss: రాయపూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమికి టాస్ కోల్పోవడం, మంచు ప్రభావం బౌలర్లకు ఇబ్బందిగా మారిందని కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. భారీ స్కోరు సాధించినా, విరాట్ కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు చేసినా 

PREV
15
రెండో వన్డే ఓటమి..

రాయపూర్‌లో బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమికి టాస్ కోల్పోవడమే ప్రధాన కారణమని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫలితంపై టాస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.

25
భారీ లక్ష్యం.. కానీ.!

భారత్ మొదట బ్యాటింగ్ చేసి 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ స్కోరు సాధించడంలో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్రలు పోషించారు. విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు చేసి తన కెరీర్‌లో 53వ వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులు చేసి తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇద్దరి అద్భుత శతకాలతో భారత్ భారీ స్కోరు సాధించింది, ఇది మ్యాచ్ గెలవడానికి సరిపోతుందని చాలామంది భావించారు. అయితే, దక్షిణాఫ్రికా జట్టు 49.2 ఓవర్లలోనే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయదుందుభి మోగించింది.

35
స్పిన్ వేయడంలో కష్టం...

మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం బౌలర్లకు తీవ్రమైన ఇబ్బందులను సృష్టించిందని వివరించాడు. బంతి తడిగా మారడంతో దానిపై పట్టు సాధించడం, స్పిన్ తిప్పడంలో బౌలర్లు చాలా కష్టపడ్డారని అన్నాడు. "ఈ ఓటమి అంత బాధగా అనిపించట్లేదు. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ కారణంగా బౌలింగ్ చాలా కష్టంగా మారింది. టాస్ మళ్లీ కీలక పాత్ర పోషించింది" అని రాహుల్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, తాను రెండోసారి కూడా టాస్ ఓడిపోవడంపై స్వయంగా నిందించుకుంటూ, "అందుకే కొంచెం నన్నే తిట్టుకుంటున్నా" అని పేర్కొన్నాడు.

45
బౌలర్లు పేలవ ప్రదర్శన..

రాహుల్ జట్టు బ్యాటింగ్ ప్రదర్శనను ప్రశంసించాడు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని, అర్ధ శతకం తర్వాత అతడు ఆటను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. విరాట్ కోహ్లీ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఇలాంటి ప్రదర్శనలను అతడు గతంలో ఎన్నోసార్లు కనబరిచాడని రాహుల్ కొనియాడాడు. భారీ స్కోరు చేసినప్పటికీ, తమ జట్టు మరో 20 నుంచి 25 పరుగులు అదనంగా చేసి ఉంటే, తడి బంతితో బౌలర్లకు మరింత ఉపయోగపడేదని అతడు అభిప్రాయపడ్డాడు. 350 ప్లస్ స్కోరు మంచిదే అయినా, అదనపు పరుగులు బౌలర్లకు రక్షణ కల్పించేవని అన్నాడు.

55
జైస్వాల్ డ్రాప్ క్యాచ్..

ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు చక్కగా రాణించినప్పటికీ, బౌలర్లు, ఫీల్డర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద ఎయిడెన్ మార్కరమ్ ఇచ్చిన సులభమైన క్యా‌చ్‌ను యశస్వి జైస్వాల్ డ్రాప్ చేయడం మ్యాచ్ గమనాన్ని మార్చివేసిందని రాహుల్ పరోక్షంగా సూచించాడు. ఆ క్యాచ్ వదిలేయడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది, ఆ తర్వాత మార్కరమ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో రాణించాడు. సమష్టిగా బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు టీమిండియాకు ఓటమిని మిగిల్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories