Mustafizur Rahman : రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న బౌలర్‌ను వదిలేసిన కేకేఆర్ ! కారణం ఇదే..

Published : Jan 03, 2026, 04:27 PM IST

KKR Targets Top Overseas Fast Bowlers: బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు రూ. 9.20 కోట్ల బడ్జెట్‌తో అతడి స్థానంలో కేకేఆర్ ఎంపిక చేయగల ఐదుగురు బెస్ట్ విదేశీ బౌలర్ల జాబితాలో ఎవరున్నారు? 

PREV
17
ముస్తఫిజుర్ ప్లేస్‌లో వచ్చేది ఎవరు? రేసులో ఉన్న 5 డేంజర్ బౌలర్లు !

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని నెలల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీని ఆదేశించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామంతో కేకేఆర్ పర్స్ లోకి మళ్లీ రూ. 9.20 కోట్ల భారీ మొత్తం వచ్చి చేరింది. ఇప్పుడు ఒక విదేశీ పేసర్ స్థానం ఖాళీగా ఉండటంతో, ముస్తఫిజుర్ స్థానంలో మరో నాణ్యమైన బౌలర్‌ను తీసుకోవడానికి కేకేఆర్ వేట మొదలుపెట్టింది. నైట్ రైడర్స్ ఎప్పుడూ అనుసరించే ‘అగ్రెసివ్, డేటా డ్రివెన్ రిక్రూట్‌మెంట్ శైలిని బట్టి, ముస్తఫిజుర్ స్థానాన్ని భర్తీ చేయగల టాప్-5 విదేశీ ఫాస్ట్ బౌలర్లను గమనిస్తే..

27
1. జే రిచర్డ్‌సన్ (ఆస్ట్రేలియా)

ముస్తఫిజుర్ స్థానంలో తీసుకోవడానికి ఈ ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ అత్యంత సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ముస్తఫిజుర్ తన కట్టర్లు, వేరియేషన్లతో ఆకట్టుకుంటే, రిచర్డ్‌సన్ మాత్రం తన రా పేస్ వేగం, అద్భుతమైన డెత్ బౌలింగ్ నైపుణ్యాలతో వికెట్లు తీస్తాడు.

ఇటీవలే పూర్తి ఫిట్‌నెస్ సాధించిన రిచర్డ్‌సన్, బిగ్ బాష్ లీగ్‌లో తన ఫామ్‌ను ఘనంగా చాటుకున్నాడు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం, కచ్చితమైన యార్కర్లు వేయడం అతని ప్రత్యేకత. ఈడెన్ గార్డెన్స్ ఫ్లాట్ పిచ్‌పై ఇతను కేకేఆర్‌కు ఒక బలమైన ఆయుధంగా మారగలడు.

37
2. స్పెన్సర్ జాన్సన్ (ఆస్ట్రేలియా)

అందుబాటులో ఉన్న వారిలో అత్యంత ఆసక్తికరమైన టాక్టికల్ రీప్లేస్‌మెంట్ స్పెన్సర్ జాన్సన్. ఐపీఎల్ 2026 వేలానికి ముందు కేకేఆర్ ఇతనిని రిలీజ్ చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు. ఇప్పుడు ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న జాన్సన్, కేకేఆర్ కోరుకునే హై వెలాసిటీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్హతలకు సరిగ్గా సరిపోతాడు.

ముస్తఫిజుర్ లాగే ఇతను కూడా ఎడమ చేతి వాటం బౌలర్. కానీ, ముస్తఫిజుర్ కంటే మరింత వేగంతో, గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేయగలడు. కొత్త బంతితో స్వింగ్ చేయడం, డెత్ ఓవర్లలో మిచెల్ స్టార్క్ తరహాలో ప్రమాదకరమైన యార్కర్లు వేయడం జాన్సన్‌ను నంబర్ వన్ టార్గెట్‌గా మారుస్తోంది.

47
3. అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్)

డిసెంబర్ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (6/12) నమోదు చేసిన రికార్డు ఇతని పేరు మీద ఉంది.

కేకేఆర్‌కు వెస్టిండీస్ ఆటగాళ్లతో ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. జోసెఫ్ తన హై ఆర్మ్ యాక్షన్, బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ముఖ్యంగా కేకేఆర్ ప్రధాన పేసర్ మతీషా పతిరానాకు ఇతను మంచి బ్యాకప్‌గా ఉపయోగపడతాడు.

57
4. ల్యూక్ వుడ్ (ఇంగ్లాండ్)

ఒకవేళ కేకేఆర్ కచ్చితంగా ముస్తఫిజుర్ స్థానంలో మరో ఎడమ చేతి వాటం పేసర్‌నే తీసుకోవాలని భావిస్తే, ల్యూక్ వుడ్ సరైన ఆప్షన్. ఎడమ చేతి వాటం బౌలర్లు అందించే నేచురల్ యాంగిల్ కుడి చేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. ఇది కేకేఆర్ వ్యూహంలో కీలక భాగం.

ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో వుడ్ సంచలనంగా మారాడు. తన స్కిడ్డీ పేస్, ప్లేయర్లను మాయచేసే స్లోయర్ బంతులకు ఇతను పెట్టింది పేరు. ఇతని శైలి ముస్తఫిజుర్‌ను పోలి ఉన్నా, వేగం విషయంలో ముస్తఫిజుర్ కంటే కాస్త మెరుగ్గా ఉంటాడు.

67
5. గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా)

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో కరాటే కిడ్ గా పిలవబడే కోయెట్జీ హై ఇంటెన్సిటీ బౌలర్. వేలంలో పెద్దగా వినిపించకపోయానా బౌలింగ్ అటాక్‌ను ముందుండి నడిపించగల సత్తా ఉన్న బౌలర్.

కోయెట్జీ కేవలం పరుగులను కట్టడి చేయడమే కాదు, భాగస్వామ్యాలను విడదీసే వికెట్ టేకర్. ఇతని దూకుడు స్వభావం కోల్‌కతా ఫ్రాంచైజీకి ఉన్న నెవర్ సే డై అనే ఆటిట్యూడ్‌కు సరిగ్గా సరిపోతుంది.

77
ముస్తఫిజుర్: బీసీసీఐ ఆదేశాలు.. అసలు వివాదం ఏంటి?

బీసీసీఐ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ఐపీఎల్ 2026 స్క్వాడ్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేసింది. మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న లీగ్ పాలక మండలి, బంగ్లాదేశ్ పేసర్‌ను వదులుకోవాలని ఫ్రాంచైజీని కోరింది.

ఈ విషయాన్ని కేకేఆర్ అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. "ఐపీఎల్ రెగ్యులేటర్‌గా బీసీసీఐ ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను స్క్వాడ్ నుంచి విడుదల చేశాం. బోర్డు సూచనల మేరకే తగిన ప్రక్రియను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవడానికి బీసీసీఐ అనుమతి ఇస్తుంది" అని కేకేఆర్ పేర్కొంది.

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుతం అన్నిచోట్లా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ కేకేఆర్‌ను ఆదేశించింది" అని తెలిపారు. డిసెంబర్ 2025లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తఫిజుర్‌ను రూ. 9.20 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే, ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలు, వివిధ మతపరమైన సమూహాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్య, మైనారిటీల భద్రతపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముస్తఫిజుర్ ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories