Image Credits: TwitterAll India Radio News
ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత పరుషుల జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో వరుస విజయాలతో భారత పరుషుల జట్టు గ్రూప్ Aలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 9 పాయింట్లతో నాకౌట్ దశకు దాదాపుగా అర్హత సాధించింది.
ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ, బుధవారం జనవరి 15న ఇందిరా గాంధీ స్టేడియంలో పెరూపై వరుసగా మూడో విజయం సాధించింది. గ్రూప్ దశలో నేపాల్, బ్రెజిల్‌పై భారత్ గెలిచింది.
Kho Kho World Cup 2025, Kho Kho World Cup, Prateek Waikar
అంచనాలకు తగ్గట్టుగా జోరు కొనసాగిస్తున్న భారత పురుషుల జట్టు
ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో భారత్ అంచనాలకు తగ్గట్టుగా ఆటను కొనసాగిస్తోంది. పెరూతో జరిగిన గ్రూప్ A మ్యాచ్‌లో ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన భారత్ మొదటి టర్న్‌లో అటాకింగ్ ను ఎంచుకుంది. భారత అటాకర్స్ ఏడు నిమిషాలలో 15 పెరూ డిఫెండర్లను ఔట్ చేశారు. ఆ తర్వాత కూడా భారత పరుషుల జట్టు అదే జోరును కొనసాగించింది.
Image Credit: TwitterKho Kho World Cup 2025
భారత్ ముందు పెరూ నిలవలేకపోయింది
మొదటి టర్న్ ముగిసే సమయానికి భారత్ 36 పాయింట్లు సాధించింది. రెండో టర్న్‌లో పెరూ దాడి చేసింది, కానీ భారత డిఫెండర్ల చురుకుదనానికి సరితూగలేక 16 పాయింట్లు మాత్రమే సాధించింది. రెండో టర్న్ ముగిసే సమయానికి భారత్ 36-16తో 20 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.
మూడో టర్న్‌లో భారత దాడిని పెరూ డిఫెండర్లు తట్టుకోలేకపోయారు. భారత్ 34 పాయింట్లు సాధించి మొత్తం 70 పాయింట్లకు చేరుకుంది. నాలుగో టర్న్‌లో పెరూ మెరుగైన ప్రదర్శన కనబరిచి 22 పాయింట్లు సాధించింది. పెరూ మొత్తం 38 పాయింట్లు సాధించింది.
గ్రూప్ Aలో అగ్రస్థానంలో భారత జట్టు
రెండో సగం ముగిసే సమయానికి భారత్ తన ఆధిక్యాన్ని 20 నుంచి 32 పాయింట్లకు పెంచుకుంది. నాలుగో టర్న్‌లో పెరూ పోరాట పటిమను ప్రేక్షకులు ప్రశంసించారు. వరుస విజయాలతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 9 పాయింట్లు, 68 పాయింట్ల తేడాతో నాకౌట్ దశకు దాదాపుగా అర్హత సాధించింది.
ఇంతకుముందు, భారత మహిళల జట్టు ఇరాన్‌పై 100-16 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో 100 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించింది. దక్షిణ కొరియాపై 157 పాయింట్ల తేడాతో గెలిచింది.
పురుషుల విభాగంలో నేపాల్, భూటాన్ గ్రూప్ Aలో ఒక్కో మ్యాచ్ గెలిచాయి. గ్రూప్ Bలో ఘనా, దక్షిణాఫ్రికా, ఇరాన్ ఒక్కో మ్యాచ్ గెలిచాయి. దక్షిణాఫ్రికా వరుసగా మూడు విజయాలతో నాకౌట్ దశకు దాదాపుగా అర్హత సాధించింది. గ్రూప్ Cలో శ్రీలంక వరుసగా రెండు విజయాలు సాధించగా, బంగ్లాదేశ్, అమెరికా ఒక్కో మ్యాచ్ గెలిచాయి.
గ్రూప్ Bలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా ఒక్కో మ్యాచ్ గెలిచాయి. ఇంగ్లాండ్ వరుసగా మూడు విజయాలతో నాకౌట్ దశకు అర్హత సాధించనుంది. గురువారం జనవరి 16న భూటాన్‌తో జరిగే చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించాలని చూస్తోంది.