IPL 2026: ఐపీఎల్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. ఢిల్లీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..

Published : Apr 07, 2026, 08:50 PM IST

IPL 2026: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తన అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి ఐపీఎల్ పట్ల తనకున్న మద్దతే కారణమని వెల్లడించారు. 2009 సమయంలో ఐపీఎల్ పట్ల ఇంగ్లాండ్ బోర్డుకు వ్యతిరేకత ఉండేదని..

PREV
15
కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో కెవిన్ పీటర్సన్ ఒకరు. అయితే, ఆయన కెరీర్ అందరూ ఊహించినట్లుగా సుదీర్ఘ కాలం సాగలేదు. తాజాగా రణ్వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పీటర్సన్, తన కెరీర్ ముగింపు గురించి కొన్ని ఆసక్తికరమైన, సంచలన విషయాలను పంచుకున్నారు. ఐపీఎల్ పట్ల తనకు ఉన్న మక్కువ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పాతకాలపు ఆలోచనలే తన పతనానికి కారణమని ఆయన ఆరోపించారు.

25
ఐపీఎల్ పట్ల బోర్డు వ్యతిరేకత:

2009 సమయంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆ లీగ్‌ను వ్యతిరేకించేదని పీటర్సన్ గుర్తు చేశారు. అయితే, కొత్తతరం క్రికెట్ కోసం ఆటగాళ్ల ఆర్థిక ప్రయోజనాల కోసం ఐపీఎల్ వంటి లీగ్‌లు అవసరం అని తాను బలంగా నమ్మి మద్ధతు పలికానని చెప్పారు. ఈ నిర్ణయం బోర్డులోని పెద్దలకు నచ్చలేదని, వారు తనను ఒక స్వార్థపరుడిగా ముద్ర వేసి జట్టుకు దూరం చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

35
కోల్పోయిన అవకాశాలు

పీటర్సన్ తన టెస్ట్ కెరీర్‌లో 104 మ్యాచ్‌ల్లో 8,181 పరుగులు సాధించినప్పటికీ, కేవలం 33 ఏళ్ల వయసులోనే ఆయనను జట్టు నుంచి తప్పించారు. బోర్డుతో విభేదాలు లేకపోయి ఉంటే, తాను కనీసం 150 నుండి 160 టెస్టులు ఆడి ఉండేవాడినని, సుమారు 13,000 పరుగులు చేసే సత్తా తనలో ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ గొప్పతనాన్ని ఒక దశాబ్దం ముందే గుర్తించినందుకు తాను బలి పశువును అయ్యానని పీటర్సన్ పేర్కొన్నారు.

45
నేటి తరం ఆటగాళ్లకు మార్గదర్శి

ప్రస్తుతం బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ వంటి ఇంగ్లాండ్ ఆటగాళ్లు కోట్లలో ఐపీఎల్ కాంట్రాక్టులు పొందుతున్నారంటే, ఆనాడు తాను చేసిన పోరాటమే కారణమని పీటర్సన్ గుర్తు చేశారు. 

55
ప్లేయర్, కోచ్

ఒకప్పుడు కెవిన్ పీటర్సన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ టైంలో ప్లేయర్ గా.. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ టైంలో ఆ జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆటగాళ్ల స్వేచ్ఛ కోసం తాను తన కెరీర్‌నే పణంగా పెట్టానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories