IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరే టాప్ 4 జట్లు ఇవే.! CSK, KKR, SRHలకు గట్టి షాక్..

Published : Apr 07, 2026, 08:22 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల బట్టి చూస్తే ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు 70 నుంచి 80 శాతం వరకు ఉన్నాయి.  

PREV
15
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు..

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్‌ల ప్రదర్శనను చూస్తే, ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరువలో ఉన్నాయి, ఏ జట్లు వెనుకబడి ఉన్నాయనే దానిపై ఒక స్పష్టత వస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న జట్లు ఈసారి పైచేయి సాధించేలా కనిపిస్తున్నాయి.

25
ప్లేఆఫ్స్ చేరే బలమైన జట్లు..

ప్రస్తుత గణాంకాల ప్రకారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, వారి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది.

35
ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఒక్కడిపైనే..

ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సమీర్ రిజ్వీపై అతిగా ఆధారపడటం ఆ జట్టుకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ రిజ్వీ విఫలమైతే ఢిల్లీ కష్టాల్లో పడవచ్చు. పంజాబ్, ఆర్సీబీ జట్లు ఈసారి సమతూకంతో కనిపిస్తున్నాయి.

45
ప్రమాదంలో ఉన్న దిగ్గజ జట్లు

ఆశ్చర్యకరంగా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన సిఎస్కే ఈసారి ప్లేఆఫ్ చేరడం కష్టమనిపిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలవ్వడం, అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో విఫలం కావడం జట్టును ఇబ్బందుల్లో నెట్టింది. అలాగే, 25 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ విఫలం కావడం, స్పిన్ విభాగం బలహీనంగా ఉండటంతో కేకేఆర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా ఫామ్ లేమితో సతమతమవుతూ పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

55
మధ్యలో ఉన్న జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన అస్థిరంగా ఉంది. ఈ జట్లు కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే ఆధారపడుతున్నాయి. బౌలింగ్‌లో కూడా రాణిస్తేనే వీరికి ప్లేఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి. లీగ్ ఇంకా తొలి దశలోనే ఉన్నప్పటికీ, ఇప్పుడు లెక్కల ప్రకారం పైన పేర్కొన్న నాలుగు జట్లు ప్లేఆఫ్స్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories