ఇందులో భాగంగా రూ. 299 అంతకంటే ఎక్కువ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకునే వారికి ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్ స్టార్ సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు. కేవలం మొబైల్‌కి మాత్రమే పరిమితం కాకుండా టీవీల్లోనూ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.
4కే రిజల్యూషన్‌తో టీవీలో కంటెంట్ వీక్షించవచ్చు. దీంతో పాటు 50 రోజుల జియో ఫైబర్ సేవలను కూడా ఉచితంగా పొందొచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ వైఫై, 800ప్లస్ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.