స్మృతి మందాన కోసం జెమిమా త్యాగం.. ఇలా ఏ క్రికెటర్ చేసుండరు..!

Published : Nov 27, 2025, 06:04 PM ISTUpdated : Nov 27, 2025, 06:17 PM IST

Smriti Mandhana Jemimah Rodrigues Friendship : స్నేహం కోసం తన కెరీర్ నే లెక్కచేయడంలేదు టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్. పెళ్ళి క్యాన్సిల్ అయి బాధలో ఉన్న స్మృతి మందాన కోసం జెమిమా ఏం చేసిందో తెలుసా? 

PREV
17
జెమీమా రోడ్రిగ్స్ త్యాగం...

Jemimah Rodrigues : మహిళల బిగ్ బాష్ లీగ్ నుంచి భారత క్రీడాకారిణి జెమిమా రోడ్రిగ్స్ తప్పుకుంది. జెమిమా ఇండియాలోనే ఉంటుందని బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచేజీ స్పష్టం చేసింది. బాధలో ఉన్న స్మృతి మందానకు తోడుగా ఉండేందుకు అనుమతించాలన్న ఆమె అభ్యర్థనను ఫ్రాంచేజీ అంగీకరించింది. జెమిమాకు కూడా ఇది సవాలుతో కూడిన సమయమని... ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని బ్రిస్బేన్ హీట్ సీఈఓ టెర్రీ స్వెన్సన్ తెలిపారు.

27
WWBB నుండి జెమిమా ఔట్

ప్రస్తుతం వెబెర్ ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WWBB)లో బ్రిస్బేన్ హీట్స్ తరపున జెమిమా ఆడుతున్నారు. అయితే స్మృతి మందాన పెళ్లికోసం ఆమె హోబర్ట్ హరికేన్స్ తో మ్యాచ్ అనంతరం అంటే పదిరోజులక్రితం ఇండియాకు వెళ్లిపోయినట్లు హీట్స్ తెలిపింది.  కానీ ఈ పెళ్లి అనుకోకుండా వాయిదాపడింది... దీంతో ఈ కష్టకాలంలో తన సహచర క్రికెటర్ పక్కనే ఉండి సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం ఉందని జెమీమా తెలిపినట్లు హీట్స్ సీఈవో వెల్లడించారు. ఆమె అభ్యర్థనను మన్నించి WBBL నుండి విడుదల చేస్తున్నట్లు సీఈవో ప్రకటించారు. 

37
స్మృతి గురించి బ్రిస్బేన్ హీట్స్

ఇక స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం గురించి కూడా బ్రిస్బేన్ హీట్స్ యాజమాన్యం స్పందించింది. ఈ పరిస్థితుల్లో స్మృతితో పాటు ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలి... వారి భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నామంది బ్రిస్బేన్ హీట్స్. WBBL సీజన్లో మిగతా నాలుగు గేమ్స్ కు జెమిమా దూరంగా ఉంటుంది... అంటే ఈ సీజన్ లో ఆమె చివరి మ్యాచ్ ఆడేసిందన్నమాట.

47
స్మృతి మందాన, జెమిమా స్నేహం

స్మృతి మందాన, జెమిమా మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ ముంబైకి చెందినవారే... ఇదికూడా వారిద్దరి మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది. క్రికెటర్లుగానే కాదు వ్యక్తిగతంగాను   స్మృతి, జెమిమా చాలా సరదాగా ఉంటారు. సోషల్ మీడియాలో వీరి స్నేహాన్ని తెలియజేసే అనేక వీడియోలున్నాయి. 

ఇటీవల స్మృతి ఎంగేజ్మెంట్ రివీల్, హల్దీ వీడియోల్లో కూడా జెమిమా ఉంది. ఇలాంటి తన ప్రాణ స్నేహితురాలు బాధలో ఉండగా తాను క్రికెట్ ఆడటం భావ్యం కాదని భావించింది జెమిమా... స్మృతి పక్కనే ఉండాలని నిర్ణయించుకుని WBBL అవకాశాన్ని వదులుకుంది. కెరీర్ ను కాదని స్నేహానికి ఓటేసింది జెమిమా. 

57
స్మృతిని పలాష్ చీట్ చేశాడా?

స్మృతి మందానా, పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడటానికి అసలు కారణమేంటో తెలీదు... కానీ ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి పలాష్ అక్రమ సంబంధం వ్యవహారం. మేరీ డి కోస్టా అనే యువతి పలాష్‌తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో బయటపెట్టింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది నిజంగా పలాష్‌తో మాట్లాడినదేనా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. . ఆ యువతిని మారియట్ హోటల్‌లోని పూల్‌లో కలిసి ఈత కొట్టడానికి ఆహ్వానించడం, స్మృతితో సంబంధం గురించిన ప్రశ్నలు, పలాష్ సమాధానాలు వాట్సాప్ చాట్‌లో ఉన్నాయి.

ఇక ఓ కొరియోగ్రాఫర్ తో పలాష్ సన్నిహితంగా ఉండగా స్మృతి రెడ్ హ్యాండెెడ్ గా పట్టుకుందని మరో ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులపై ఇరు కుటుంబాలు ఇప్పటివరకు స్పందించలేదు. 

67
బాాధలో స్మృతి

పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి మందాన తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియం మధ్యలో పలాష్ ముచ్చల్ ప్రపోజ్ చేసిన వీడియోతో సహా స్మృతి అన్నింటినీ తొలగించింది. స్మృతితో పాటు ఆమె స్నేహితులైన జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ కూడా స్మృతి పెళ్లికి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియా నుంచి తీసేశారు.

77
పలాష్ వల్లే పెళ్లి ఆగిందా..?

గత ఆదివారం (నవంబర్ 23న) మహారాష్ట్రలోని సాంగ్లీలో స్మృతి, పలాష్ ముచ్చల్ పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి రోజున స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఇరు కుటుంబాలు తెలిపాయి. కానీ అసలు కారణం ఇది కాదని... స్మృతిని పలాష్ చీట్ చేసి పెళ్లి చేసుకోవాలని చూశాడని... చివరి నిమిషంలో పలాష్ అసలు రూపం బైటపడటంతో పెళ్ళి ఆగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories