Jasprit Bumrah : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో మరో ఒక్క వికెట్‌తో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 500 అంతర్జాతీయ వికెట్ల క్లబ్‌లో చేరుతాడు.
బుమ్రా సంచలనం.. ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డు
టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక భారీ మైలురాయిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరడానికి బుమ్రాకు కేవలం ఒకే ఒక్క వికెట్ అవసరం.
26
500 వికెట్ల క్లబ్‌లో ఎనిమిదో భారతీయుడిగా బుమ్రా
ప్రస్తుతం బుమ్రా తన ఖాతాలో 499 అంతర్జాతీయ వికెట్లను కలిగి ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై ఒక వికెట్ తీస్తే, ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), రవీంద్ర జడేజా (634), జహీర్ ఖాన్ (597), జవగల్ శ్రీనాథ్ (551) మాత్రమే ఉన్నారు. బుమ్రా ఈ మైలురాయిని చేరుకుంటే, శ్రీనాథ్, జహీర్, కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ ఫాస్ట్ బౌలర్‌గా నిలుస్తాడు.
36
ఇంగ్లాండ్‌పై బుమ్రా అద్భుత రికార్డు
ఇంగ్లాండ్ బ్యాటర్లకు బుమ్రా ఎప్పుడూ ఒక సింహస్వప్నమే. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన 5 మ్యాచుల్లో బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి ఇంగ్లాండ్‌పై 29 మ్యాచులు ఆడిన బుమ్రా, సరిగ్గా 100 వికెట్లు తీసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కూడా బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై తన బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించాడు.
2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రా, గత పదేళ్లుగా టీమ్ ఇండియా ప్రధాన మ్యాచ్ విన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 234 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన బుమ్రా 20.60 సగటుతో, 3.72 ఎకానమీతో 499 వికెట్లు సాధించాడు. ఇందులో 18 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.
• టెస్ట్ క్రికెట్: 52 మ్యాచుల్లో 234 వికెట్లు.
• వన్డే క్రికెట్: 89 మ్యాచుల్లో 149 వికెట్లు.
• టీ20 క్రికెట్: 93 మ్యాచుల్లో 116 వికెట్లు.
56
ప్రపంచకప్ చరిత్రలో మరో రికార్డు దిశగా బుమ్రా
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో కూడా బుమ్రా అగ్రస్థానానికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 24 మ్యాచుల్లో 35 వికెట్లతో ఉన్న బుమ్రా, ఇంగ్లాండ్‌పై మరో 4 వికెట్లు తీస్తే అన్రిచ్ నోర్ట్జే (38 వికెట్లు), లసిత్ మలింగ (38 వికెట్లు) రికార్డులను అధిగమిస్తాడు. ప్రస్తుత టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ బుమ్రాను ఒక బ్రహ్మాస్త్రంలా వాడుకుంటున్నారు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీయడంలో బుమ్రాకు సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపితమైంది.
66
విమర్శల నుంచి విశ్వవిజేత వరకు.. బుమ్రా ప్రయాణం
బుమ్రా విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా అతను ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడని చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా 2023లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత అతని కెరీర్ ముగిసిందని భావించారు. కానీ, బుమ్రా అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు. "నన్ను 6 నెలలు లేదా 8 నెలలు మాత్రమే ఆడతారని అన్నారు, కానీ నేను 10 ఏళ్లుగా ఆడుతున్నాను" అని బుమ్రా గతంలో గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఐదు ఐపీఎల్ టైటిల్స్, ఒక టీ20 ప్రపంచకప్ (2024) గెలిచిన బుమ్రా, ఇప్పుడు 2026లో మరో ప్రపంచకప్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.