దేశం కంటే డబ్బే ముఖ్యం.. ఈ ఆల్‌రౌండర్‌పై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Published : Jan 23, 2026, 07:11 PM IST

James Neesham: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ భారత్‌తో జరగుతోన్న కీలకమైన T20 సిరీస్‌కు దూరం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో తన జట్టు రాజ్ షాహీ వారియర్స్ తరపున ఆడటానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.

PREV
15
దేశం తరపున ఆడటమా లేదా..

అంతర్జాతీయ క్రికెట్‌లో దేశం తరపున ఆడటమా లేదా భారీ వేతనాలతో కూడిన ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనడమా అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఈ వివాదం తాజాగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ రాజుకుంది. భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, నీషమ్ చివరి నిమిషంలో జాతీయ జట్టు నుంచి తప్పుకున్నారు.

25
ప్రధాన కారణం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌

ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో(బీపీఎల్) తన జట్టు రాజ్ షాహీ వారియర్స్ తరపున క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడటానికి ప్రాధాన్యం ఇవ్వడమే. బీపీఎల్ 2025-26 సీజన్ కోసం రాజ్ షాహీ వారియర్స్ తో తన ఒప్పందాన్ని నీషమ్ పొడిగించుకున్నారు. 2026 T20 ప్రపంచ కప్‌కు కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో భారత్ వంటి దిగ్గజ జట్టుతో తలపడటం ఆటగాళ్ల సన్నద్ధతకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

35
జాతీయ విధులను పక్కనపెట్టి..

అయితే, నీషమ్ జాతీయ విధులను పక్కనపెట్టి ఫ్రాంచైజీ బాట పట్టడం న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్‌మెంట్‌తో పాటు కివీస్ అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుభవజ్ఞుడైన నీషమ్ లాంటి ఆటగాడు మైదానంలో లేకపోవడం కివీస్ జట్టు సమతుల్యతను దెబ్బ తీస్తుంది.

45
స్పిన్ అనుకూల పిచ్‌లపై

ముఖ్యంగా భారత్‌లోని స్పిన్ అనుకూల పిచ్‌లపై ఆయన బౌలింగ్, బ్యాటింగ్ సత్తా జట్టుకు ఎంతో అవసరం. ఈ నిర్ణయం ద్వారా నీషమ్ తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధ్యానం ఇచ్చారని, దేశ గౌరవాన్ని తక్కువ చేశారని విమర్శలు ఇప్పుడు క్రీడా లోకంలో బలంగా వినిపిస్తున్నాయి.

55
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

నీషమ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై న్యూజిలాండ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశం తరపున ఆడే అవకాశం ఉన్నప్పుడు కేవలం లీగ్ క్రికెట్ కోసం దాన్ని కాలదన్నడం క్షమించరాని నేరం అని వాదిస్తున్నారు. వచ్చే ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి నీషమ్ ను వెంటనే తొలగించాలని, ఇలాంటి వైఖరి ఉన్న ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకూడదని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories