IPL Tickets : సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్లపై సూపర్ డిస్కౌంట్.. రూ.1800 టికెట్ రూ.500కే..! ఎలా పొందాలో తెలుసా..?

Published : Apr 21, 2026, 02:24 PM IST

బడ్జెట్ తక్కువగా ఉందని స్టేడియానికి వెళ్లి ఐపీఎల్ మ్యాచ్ చూడలేకపోతున్నారా..? అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో మీకోసం ఒక 'రాయల్' ఆఫర్. రూ.1800 విలువైన టికెట్‌ను కేవలం రూ.500కే పొందవచ్చు. 

PREV
15
ఐపిఎల్ టికెట్లపై సూపర్ డిస్కౌంట్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సగం లీగ్ ముగిసింది... ఇకపై జరిగే మ్యాచ్ లు మరింత ఉత్కంఠగా సాగనున్నాయి. ఈ క్రమంలో మీరు మైదానానికి వెళ్ళి నేరుగా మ్యాచ్ చూడాలనుకుంటున్నారా...? అయితే భారీ డిస్కౌంట్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు పొందవచ్చు.

రాజస్థాన్ రాయల్స్ (RR) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ ఖన్నా ఈ ఆఫర్ వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 25న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా విద్యార్థుల కోసం టికెట్ ధరలను కేవలం రూ.500కు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఈ టికెట్లు ఈస్ట్ స్టాండ్ కోసం కేటాయించామని.. ఇక్కడినుండి గ్రౌండ్ వ్యూ అద్భుతంగా ఉంటుందన్నారు. సాధారణంగా ఈ స్టాండ్ టికెట్ ధర రూ.1800... అంటే ఈ ఆఫర్‌తో విద్యార్థులకు నేరుగా రూ.1300 ఆదా అవుతుందన్నమాట.

25
రూ.500 టికెట్ ఎక్కడ దొరుకుతుంది..?

ఏప్రిల్ 25న జరగబోయే రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు. కేవలం స్టేడియం కౌంటర్లలో మాత్రమే అమ్ముతారు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 24న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలోని ఆఫ్‌లైన్ కౌంటర్ల నుంచి టికెట్లు కొనుక్కోవచ్చు. ఈస్ట్, వెస్ట్, నార్త్ గేట్ల దగ్గర ఉన్న ఏ కౌంటర్‌లోనైనా టికెట్లు తీసుకోవచ్చు. ఏప్రిల్ 24న కౌంటర్ల వద్ద భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది, కాబట్టి వీలైనంత త్వరగా లైన్‌లో నిల్చోవడం మంచిది.

35
ఐపీఎల్ టికెట్ పొందాలంటే ఏం చేయాలి..?

టికెట్ కౌంటర్‌కు వెళ్లేటప్పుడు మీ ఒరిజినల్ కాలేజ్ లేదా స్కూల్ ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

ఒక ఐడీ కార్డుపై ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. ఒకే ఐడీ కార్డుతో గ్రూప్ మొత్తానికి టికెట్లు తీసుకోవడం కుదరదు.

45
విద్యార్థులకు ఈ ఆఫర్ ఎందుకంత ప్రత్యేకం?

ఈ ఏడాది ఐపీఎల్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. జైపూర్‌లో అత్యల్ప టికెట్ ధర రూ.1800గా ఉంది. ఇక వీఐపీ 'డ్రీమ్ లాంజ్' టికెట్ల కోసం జనం రూ.40,000 వరకు ఖర్చు చేస్తున్నారు. డిమాండ్ పెరిగేకొద్దీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కేవలం రూ.500కే మ్యాచ్ చూడటం విద్యార్థులకు కల నిజమైనట్లే.

55
రాజస్థాన్ ఆడే తర్వాతి మ్యాచ్ లు ఇవే..

ఏప్రిల్ 25 ; రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్

మే 1 : రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్

మే 9 : రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్

మే 19 : రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్

Read more Photos on
click me!

Recommended Stories