SRH: ఐపీఎల్ 2026లో వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించి..
ఐపీఎల్ 2026లో వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలగా ఉంది.
25
బౌలింగ్‌లో పుంజుకున్న హైదరాబాద్
సీజన్ ఆరంభంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపించింది. అయితే గత రెండు మ్యాచుల్లో బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే వికెట్ తీసి నిప్పులు చెరగగా, చెన్నైతో మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బౌలర్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించారు. ఈ ప్రదర్శన జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
35
బ్యాటింగ్, ఫినిషింగ్ సమస్యలు
హైదరాబాద్ బ్యాటింగ్ విభాగంలో దూకుడు ఉన్నప్పటికీ నిలకడ లేమి కనిపిస్తోంది. టాప్ ఆర్డర్‌లో ఎవరో ఒకరు రాణిస్తున్నా, చివర్లో సరైన ఫినిషింగ్ లేకపోవడం జట్టును ఇబ్బంది పెడుతోంది. మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఓపెనర్లు కనీసం ఆరేడు ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్త పడితే, భారీ స్కోరు సాధించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన ఈ సీజన్‌లో మిశ్రమంగా ఉంది. కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, ట్రిస్టన్ స్టబ్స్ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి జట్టు భారీ స్కోర్లు ఆశిస్తోంది. అయితే స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. లుంగి ఎంగిడి, ముకేష్ కుమార్, నటరాజన్ ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా, కుల్దీప్ యాదవ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఢిల్లీకి ఆందోళన కలిగిస్తోంది.
55
ఆరు పాయింట్లతో ఉన్నప్పటికీ
పాయింట్ల పట్టికలో ఇరుజట్లు సమానంగా ఆరు పాయింట్లతో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పరంగా హైదరబాద్ మెరుగ్గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఢిల్లీ కంటే హైదరాబాద్‌కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషణలు చెప్తున్నాయి. హోమ్ గ్రౌండ్‌లో అభిమానుల మద్థతు మధ్య ఆరెంజ్ ఆర్మీ మరో భారీ స్కోరుతో అలరిస్తుందో లేదో చూడాలి.