అయ్యో భగవంతుడా.! కావ్య పాప ఇలా చేశావేంటి.. ఈసారి కూడా కప్పు పాయే

Published : Dec 19, 2025, 06:55 PM IST

IPL: ఐపీఎల్ మినీ వేలం 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 25.5 కోట్లతో బరిలోకి దిగినా నిరాశపరిచింది. కీలక బలహీనతలను అధిగమించలేక, స్టార్ ప్లేయర్ల కోసం బిడ్ చేయకుండా అనూహ్యంగా అనామకులను ప్రయత్నించి.. 

PREV
15
వేలంలో అట్టర్ ప్లాప్..

ఐపీఎల్ మినీ వేలం 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన వ్యూహంతో అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను తీవ్రంగా నిరాశపరిచింది. అబుదాబిలో జరిగిన ఈ మినీ ఆక్షన్‌లో రూ. 25.5 కోట్ల భారీ పర్స్‌తో అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీ దూకుడుగా వ్యవహరించలేకపోయింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లందరినీ అట్టిపెట్టుకున్నప్పటికీ, వారికి సరితూగే బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేయడంలో విఫలమైంది.

25
షమీకి సరైన రీప్లేస్‌మెంట్‌ ఏది.?

గత సీజన్‌లో జట్టు వైఫల్యానికి కారణమైన బలహీనతలను అధిగమించలేకపోవడం జట్టుకు పెద్ద లోపంగా మారింది. ముఖ్యంగా, స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి సరైన రీప్లేస్‌మెంట్‌ను కొనుగోలు చేయలేకపోయింది. రూ. 25.5 కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోలేదు. పేరున్న ఆటగాళ్ల కోసం సన్‌రైజర్స్ కనీసం బిడ్ కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

35
రవి బిష్ణోయ్‌ను వదులుకుంది..

అందరూ ఊహించినట్లుగానే, రవి బిష్ణోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివరిలో చేతులెత్తేసింది. రవి బిష్ణోయ్ కోసం రూ. 7 కోట్ల వరకు బిడ్ వేసిన సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ రూ. 7.20 కోట్లకు బిడ్ వేయడంతో వెనక్కి తగ్గింది. అయితే, అనామక ఆటగాళ్ల కోసం ఆరెంజ్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది. స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కార్తీక్ శర్మ, పేస్ ఆల్‌రౌండర్ అకీబ్ దార్‌‌ల కోసం ప్రయత్నించి వెనకడుగు వేసింది.

45
విధ్వంసకర బ్యాటర్‌కు అంత ధర..

ఈ వేలంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో అన్‌సోల్డ్‌గా నిలిచిన లియాం లివింగ్‌స్టోన్‌ను రూ. 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత జాక్ ఎడ్వర్డ్స్ కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేసింది. మరో ఆప్షన్ లేకనే ఈ ఇద్దరినీ కొనుగోలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహరించిన తీరు అభిమానులతో పాటు కామెంటేటర్లను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోయినప్పటికీ, కోర్ టీమ్ బలంగానే ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

55
మినీ వేలంలో కొన్నది వీరినే..

మినీ వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల ఇలా ఉన్నారు. సలీల్ అరోరా రూ. 1.50 కోట్లు, శివాంగ్ కుమార్ రూ. 30 లక్షలు, క్రైన్స్ ఫులేట్రా రూ. 30 లక్షలు, షాకీబ్ హుస్సేన్ రూ. 30 లక్షలు, ఓంకార్ తర్మలే రూ. 30 లక్షలు, ప్రఫుల్ హింగే రూ. 30 లక్షలు, అమిత్ కుమార్ రూ. 30 లక్షలు, లియాం లివింగ్‌స్టోన్ రూ. 13 కోట్లు, శివం మావి రూ. 75 లక్షలు, జాక్ ఎడ్వర్డ్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories