ఐపీఎల్ వేలంలో స్టార్ ప్లేయర్స్‌కి నో ఛాన్స్.. ఇక కంబ్యాక్ కష్టమే.. లిస్టులో కేజీఎఫ్ స్టార్

Published : Dec 02, 2025, 06:51 PM IST

IPL: ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందే పెద్ద షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరించిన ఆండ్రీ రసెల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ ప్లేయర్లు లీగ్‌కు దూరమవుతున్నారు. తాజాగా మొయిన్ అలీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ కోవలో చేరారు.

PREV
15
వరుస షాక్‌లు..

ఐపీఎల్‌ కొత్త సీజన్ ప్రారంభానికి ముందే లీగ్‌కు పెద్ద షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా అభిమానులను అలరించిన కొంతమంది స్టార్ ప్లేయర్లు ఈ లీగ్‌కు దూరమవుతున్నారు. విదేశీ ఆటగాళ్లలో కీలకమైన ఆల్‌రౌండర్లు, విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నారు.

25
లీగ్ కు వీరు గుడ్ బై

ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన ఆండ్రీ రసెల్, గతంలో బెంగళూరుకు కెప్టెన్‌గా, ప్రస్తుతం ఢిల్లీలో కీలక ప్లేయర్‌గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు స్టార్ ప్లేయర్ల వరుసలో తాజాగా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు చేరారు.

35
కేకేఆర్ గట్టి షాక్ ఇచ్చింది..

ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రసెల్‌తో పాటు మొయిన్ అలీని కేకేఆర్ వదిలేసింది. కేకేఆర్ ఫ్రాంచైజీ తనను వదిలించుకోవడంతో మొయిన్ ఐపీఎల్ మొత్తానికి గుడ్‌బై చెప్పేశాడు. గత సీజన్‌లో కేవలం ఐదు పరుగులు చేసి, ఆరు వికెట్లు మాత్రమే తీసిన మొయిన్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఫ్రాంచైజీ అతన్ని రిటైన్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది.

45
స్టార్ ప్లేయర్స్ దూరం

ఇక ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర ఆటగాడు, బిగ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా వచ్చే ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా మ్యాక్సీని పంజాబ్ కింగ్స్ వదిలేసింది. దీంతో మ్యాక్సీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడటం అనుమానమే అంటున్నారు. ఆయన ఫిట్‌నెస్ సమస్యలు, అంతర్జాతీయ కమిట్‌మెంట్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

55
1355 ఆటగాళ్లు.. అందులో 16 క్యాప్డ్ భారత ప్లేయర్స్

ఇలాంటి స్టార్ ప్లేయర్స్ దూరం కావడం లీగ్‌కు పెద్ద లోటు అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే మొత్తం ఈ సీజన్ కోసం వేలంలోకి 1355 ఆటగాళ్లు వస్తుండగా.. అందులో 16 క్యాప్డ్ భారత ప్లేయర్స్ ఉన్నారు. అలాగే రూ. 2 కోట్ల లిస్టులో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. ఇక స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్ బ్యాటర్ కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories