బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఏప్రిల్ 12 వరకు 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దేశంలోని మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత విడుదల చేయనున్నారు. తొలి దశ మ్యాచ్‌లు బెంగళూరు, ముంబై, గువాహటి, చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో జరగనున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీని ఢీకొట్టబోతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ ఈసారి టైటిల్ కరవును తీర్చుకుంటుందో లేదో చూడాలి మరి.