RCB: ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. అయితే, హైదరాబాద్ టీమ్ ను ఐదుగురు ఆర్సీబీ ప్లేయర్లు భయపెడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ను దెబ్బకొట్టగల ఐదుగురు ఆర్సీబీ ఆటగాళ్లు ఎవరు?
SRH vs RCB: చిన్నస్వామిలో ఐపీఎల్ సమరం.. హైదరాబాద్ కొంపముంచేందుకు సిద్ధమైన విరాట్ సేన
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి పోరులోనే బలమైన ప్రత్యర్థులు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి.
శనివారం సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరులోని ప్రసిద్ధ ఎం. చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ రసవత్తర పోరు జరగనుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో ఆర్సీబీ బరిలోకి దిగుతుండగా, బలమైన బ్యాటింగ్ లైనప్‌తో హైదరాబాద్ సవాల్ విసురుతోంది.
27
SRH vs RCB : ముఖాముఖి పోరులో పైచేయి ఎవరిది?
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే స్వల్ప పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించగా, 11 మ్యాచ్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగిశాయి. అయితే, గత కొన్నేళ్లుగా ఆర్సీబీ జట్టులో వచ్చిన మార్పులు, ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా రేపటి మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఐదుగురు ఆర్సీబీ ఆటగాళ్లు సన్‌రైజర్స్ విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశం ఉంది. వారిలో..
37
1. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ విభాగానికి విరాట్ కోహ్లీ వెన్నెముక. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌తో ఆడిన 24 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 141 స్ట్రైక్ రేట్‌తో 805 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. సన్‌రైజర్స్ బౌలింగ్ ఎటాక్‌ను ధీటుగా ఎదుర్కోవడంలో కోహ్లీ సిద్ధహస్తుడు. అతను క్రీజులో పాతుకుపోతే హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫిల్ సాల్ట్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 175 స్ట్రైక్ రేట్‌తో 403 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. ప్రస్తుతం సాల్ట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పవర్‌ప్లే ఓవర్లలోనే వేగంగా పరుగులు రాబట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒత్తిడి పెంచగల సత్తా అతనికి ఉంది. ఆరంభంలోనే సాల్ట్ వికెట్ తీయకపోతే హైదరాబాద్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
57
3. స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా
గత సీజన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల కృనాల్, సన్‌రైజర్స్‌కు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అతని స్పిన్ బౌలింగ్ హైదరాబాద్ జట్టులోని విదేశీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలదు. అలాగే డెత్ ఓవర్లలో బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తూ జట్టుకు భారీ స్కోరును అందించగలడు.
67
4. స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్
చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీ ప్లేయర్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్, ఇప్పుడు ఆర్సీబీ తరపున బరిలోకి దిగుతున్నాడు. హైదరాబాద్ బ్యాటింగ్ బలహీనతలు, పిచ్ పరిస్థితులపై భువీకి పూర్తి అవగాహన ఉంది. పవర్‌ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో అతను దిట్ట. సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను త్వరగా అవుట్ చేయగలిగితే హైదరాబాద్ పతనం ఖాయమవుతుంది.
77
5. సైలెంట్ కిల్లర్ సుయాష్ శర్మ
ఐపీఎల్ 2025లో సుయాష్ శర్మ ఆర్సీబీ జట్టుకు సైలెంట్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడమే కాకుండా, కీలక సమయంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టడంలో కీ రోల్ అతనిది. గతేడాది చూపిన ఫామ్‌ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తే, సన్‌రైజర్స్ బ్యాటర్లకు సుయాష్ శర్మ చుక్కలు చూపించడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ ఐదుగురు ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి మరి.