IPL 2026 : కోహ్లీ, ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అదేంటో తెలుసా?

Published : Mar 27, 2026, 03:17 PM IST

IPL 2026 : ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యింది. అయితే ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదు.

PREV
16
బెంగళూరులో ఓపెనింగ్.. అక్కడే ఫైనల్.. కోల్‌కతా అభిమానులకు నిరాశ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐఫీఎల్) 19వ సీజన్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ మే 31 వరకు కొనసాగుతుంది.

అయితే ఈ సీజన్ షెడ్యూల్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లీ అభిమానులకు కాస్త నిరాశను కలిగిస్తోంది. ఒక ప్రముఖ స్టేడియంలో ఈ ఇద్దరు దిగ్గజాలు ఈ ఏడాది అడుగుపెట్టడం లేదు.

26
ఈడెన్ గార్డెన్స్‌లో ధోనీ, కోహ్లీ మిస్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్టేడియాలలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. సాధారణంగా ఇక్కడ మ్యాచ్ అంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. అయితే, 2026 షెడ్యూల్ ప్రకారం, ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ గానీ, విరాట్ కోహ్లీ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గానీ ఈ స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదు. షెడ్యూల్ లో జరిగిన మార్పుల వల్ల ఈ రెండు జట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కేకేఆర్) జరగాల్సిన ఎవే మ్యాచ్‌లు వేరే స్టేడియాలకు మారాయి.

36
ఐపీఎల్ 2026: మ్యాచ్‌ల సంఖ్యలో మార్పు లేదు

గత కొంతకాలంగా ఐపీఎల్ 2026లో మ్యాచ్‌ల సంఖ్యను 84కి పెంచుతారనే ప్రచారం జరిగింది. కానీ బీసీసీఐ పాత పద్ధతినే అనుసరించాలని నిర్ణయించింది. ఈ సీజన్‌లో కూడా మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 70 లీగ్ దశ మ్యాచ్‌లు కాగా, మిగిలిన 4 మ్యాచ్‌లు ప్లేఆఫ్స్, ఫైనల్. ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ బెంగళూరులో జరగనుండగా, గ్రాండ్ ఫైనల్ కూడా అదే మైదానంలో నిర్వహించనుండటం విశేషం.

46
12 నగరాల్లో ఐపీఎల్ 2026 సందడి

ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు దేశవ్యాప్తంగా మొత్తం 12 నగరాల్లో జరగనున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్ లలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు అంటే ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

56
ముంబై vs చెన్నై: హై వోల్టేజ్ పోరు ఎప్పుడు?

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 23న ఈ రెండు జట్లు ముంబైలో మొదటిసారి తలపడనున్నాయి. ఆ తర్వాత మే 2న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండోసారి తలపడతాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే స్టేడియం మొత్తం పసుపు, నీలం రంగులతో నిండిపోవడం ఖాయం.

66
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే

మార్చి 30: RR vs CSK – గువహటి (7:30 PM)

ఏప్రిల్ 3: CSK vs PBKS – చెన్నై (7:30 PM)

ఏప్రిల్ 5: RCB vs CSK – బెంగళూరు (7:30 PM)

ఏప్రిల్ 11: CSK vs DC – చెన్నై (7:30 PM)

ఏప్రిల్ 14: CSK vs KKR – చెన్నై (7:30 PM)

ఏప్రిల్ 18: SRH vs CSK – హైదరాబాద్ (7:30 PM)

ఏప్రిల్ 23: MI vs CSK – ముంబై (7:30 PM)

ఏప్రిల్ 26: GT vs CSK – అహ్మదాబాద్ (3:30 PM)

మే 2: CSK vs MI – చెన్నై (7:30 PM)

మే 5: DC vs CSK – ఢిల్లీ (7:30 PM)

మే 10: CSK vs LSG – చెన్నై (3:30 PM)

మే 15: LSG vs CSK – లక్నో (7:30 PM)

మే 18: CSK vs SRH – చెన్నై (7:30 PM)

మే 21: CSK vs GT – చెన్నై (7:30 PM)

ముంబై ఇండియన్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను మే 24న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈసారి ధోనీ, కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడకపోవడం బెంగాల్ క్రికెట్ అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories