IPL 2026: ఐపీఎల్ 2026 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది.. ముంబై vs చెన్నై ఫైట్ ఎప్పుడంటే?

Published : Mar 26, 2026, 07:43 PM IST

IPL 2026 Second Phase Schedule : ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు 50 లీగ్ మ్యాచ్‌లు 12 నగరాల్లో జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఐపీఎల్ 2026: రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన రెండో దశ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. గతంలో కేవలం మొదటి 20 మ్యాచ్‌ల వివరాలను మాత్రమే వెల్లడించిన బోర్డు, ఇప్పుడు లీగ్ దశలో మిగిలిన 50 మ్యాచ్‌ల పూర్తి వివరాలను వెల్లడించింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

25
ఏప్రిల్ 13 నుండి ఐపీఎల్ రెండో దశ ప్రారంభం

ఐపీఎల్ 2026 సెకండ్ ఫేస్ మ్యాచ్ లు ఏప్రిల్ 13 నుండి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోరుతో ఈ ఫేస్ మొదలుకానుంది. ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు మొత్తం 50 లీగ్ మ్యాచ్‌లు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి జట్ల మధ్య పోటీ ఈ దశలో మరింత తీవ్రతరం కానుంది.

35
12 నగరాల్లో ఐపీఎల్ సందడి

ఈ సీజన్ రెండో దశ మ్యాచ్‌లు మొత్తం 12 నగరాల్లో జరగనున్నాయి. ఇందులో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్ వంటి ప్రధాన నగరాలతో పాటు ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌లలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. జట్లు తమ హోమ్ గ్రౌండ్‌లను ఇతర నగరాలకు కూడా విస్తరించాయి. ఉదాహరణకు, పంజాబ్ కింగ్స్ తమ హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్, ధర్మశాలల్లో ఆడనుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మూడు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులో, రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.

45
ఐపీఎల్ 2025 డబుల్ హెడర్స్ టైమింగ్స్ ఇవే

ఐపీఎల్ రెండో దశలో మొత్తం ఎనిమిది డబుల్ హెడర్స్ అంటే ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉండనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం 03:30 PM ISTకి ప్రారంభం కాగా, సాయంత్రం మ్యాచ్‌లు 07:30 PM ISTకి మొదలవుతాయి. మే 24న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి.

55
MI vs CSK : ఎల్-క్లాసికో పోరు తేదీలు ఖరారు

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎల్-క్లాసికో (ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్) మ్యాచ్‌ల తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఏప్రిల్ 23న ముంబైలో జరగనుంది. మళ్ళీ మే 2న చెన్నై లో రెండో సారి ఈ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మార్చి 28న జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్ వివరాలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories