IPL 2026: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో చెలరేగిపోతున్న ఈ బీహార్ బ్యాటర్, క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్‌లోనే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడి గురించి మాజీ కెప్టెన్ సంజు శాంసన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
25
సంచలన రికార్డులు, లక్ష్యాలు
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ప్రస్థానం 2025లో మొదలైంది. తన మొదటి సీజన్‌లోనే 7 మ్యాచ్‌ల్లో 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఐపీఎల్‌లో క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని వైభవ్ ధైర్యంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
35
ద్రవిడ్‌తో మీటింగ్
సంజూ శాంసన్ ఒక సందర్భాన్ని గుర్తుచేస్తూ, ఐపీఎల్ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రవిడ్ వైభవ్‌ను పిలిచి 'నీ గేమ్ ప్లాన్ ఏంటి?' అని అడిగారని తెలిపారు. దానికి వైభవ్ ఏమాత్రం తడబడకుండా, "సార్, ప్రత్యేక ప్లాన్ ఏమీ లేదు.. నా జోన్‌లోకి బంతి వస్తే గాలిలోకి పంపించేస్తా" అని బదులిచ్చాడట.
చెప్పినట్లుగానే మైదానంలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడని, అతని ఆట తీరు ఒక వీడియో గేమ్ లా ఉంటుందని సంజు శాంసన్ కొనియాడారు. అలాగే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం నుంచి ఇప్పటిదాకా నెలకొల్పిన రికార్డులు లెక్కలేనన్ని ఉన్నాయి.
55
కీలక మార్పులు
2025లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్ సారధ్యంలోనే వైభవ్ ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు. అయితే, 2026 సీజన్ కోసం జరిగిన ట్రేడింగ్‌లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టులోకి చేరడం గమనార్హం. ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహించబోతున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి వైభవ్ సూర్యవంశికి ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో కీలకం కానుంది.