వరల్డ్ కప్ అందించాడు.. సెలక్టర్లేమో చెత్తలా పారేశారు భయ్యా

Published : Mar 19, 2026, 10:59 PM IST

England World Cup Hero : 2019 వరల్డ్ కప్ విజేత జేసన్ రాయ్‌ను సెలక్టర్లు అన్యాయంగా పక్కనపెట్టారు. ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ కెరీర్ కు ముంగింపు కార్డు పడటానికి కారణాలేంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
సిక్స్ ల మెషీన్ కు షాకిచ్చిన సెలక్టర్లు

గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు ఆ క్రికెటర్. తన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచ కప్ సాధించడంలో తన జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. అయినప్పటికీ, సెలక్టర్లు అతడిని పాల నుంచి ఈగను తీసేసినట్లు జట్టు నుంచి పక్కనపెట్టారు. ఆ ఆటగాడే ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్.

26
ఇంగ్లాండ్ బ్యాటింగ్ శైలిని మార్చేసిన యోధుడు

గత పదేళ్లలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇంగ్లాండ్ దూకుడు కొనసాగిస్తూ ఎదగడానికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ శైలి. బంతిని బాదడమే లక్ష్యంగా మైదానంలోకి దిగే విధ్వంసకర బ్యాటర్ల బలం ఇంగ్లాండ్‌కు తోడైంది. ఈ మార్పులో జేసన్ రాయ్ కీలక పాత్ర పోషించాడు. రాయ్ కేవలం ఓపెనర్ మాత్రమే కాదు, తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడి జట్టుకు భారీ పునాది వేసే సత్తా ఉన్న ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో విజయాలను అందించాడు.

36
వరల్డ్ కప్ హీరో.. కానీ అందని సరైన గుర్తింపు

2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు ఇంగ్లాండ్ చేరడంలోనూ, ట్రోఫీని ముద్దాడటంలోనూ జేసన్ రాయ్ అందించిన సహకారం వెలకట్టలేనిది. రాయ్ ఒక అద్భుతమైన వన్డే బ్యాటర్ అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ అతడికి లభించాల్సినన్ని అవకాశాలు లభించలేదన్నది వాస్తవం. కొన్నిసార్లు గాయాల కారణంగా జట్టుకు దూరమైతే, మరికొన్ని సార్లు ఇతర ఆటగాళ్లకు చోటు కల్పించే క్రమంలో సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. ఒకానొక సమయంలో జేసన్ రాయ్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు ఓపెనర్‌గా కొనసాగుతారని అందరూ భావించారు. కానీ సెలక్టర్ల నిర్ణయాలు అతని కెరీర్‌ను దెబ్బతీశాయి.

46
అద్భుతమైన గణాంకాలు.. ఆకట్టుకునే సగటు

వైట్ బాల్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో జేసన్ రాయ్ జట్టులో లోపల, బయట ఊగిసలాడాల్సి వచ్చింది. రాయ్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానం లేదు. వన్డే క్రికెట్‌లో సుమారు 40 సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండటం అతని సత్తాకు నిదర్శనం. ప్రపంచంలోని ఏ మేటి వన్డే బ్యాటర్‌తో పోల్చినా రాయ్ గణాంకాలు ఏమాత్రం తీసిపోవు. అయినప్పటికీ, సెలక్టర్లు అతడిని జట్టులో స్థిరంగా కొనసాగించలేకపోయారు.

56
రూట్, మోర్గాన్ తర్వాత రాయ్ రికార్డులే బెస్ట్

జేసన్ రాయ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఆడాడు. ఇంగ్లాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాయ్ మూడవ స్థానంలో ఉన్నాడు. జో రూట్ (20 సెంచరీలు), ఇయాన్ మోర్గాన్ (13 సెంచరీలు) మొదటి రెండు స్థానాల్లో ఉండగా, జేసన్ రాయ్ 12 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా, ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన టాప్-10 బ్యాటర్ల జాబితాలోనూ జేసన్ రాయ్ (10వ స్థానం) ఉన్నాడు. ఇన్ని ఘనతలు ఉన్నప్పటికీ సెలక్టర్ల నిర్లక్ష్యానికి అతను గురయ్యాడు.

66
ఫ్రాంచైజీ లీగ్స్‌లో రాయ్ క్రేజ్

ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న జేసన్ రాయ్, ఇంగ్లాండ్ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్స్‌లో తన సత్తా చాటుతున్నాడు. అతని గణాంకాలను పరిశీలిస్తే:

• వన్డేలు: 116 మ్యాచ్‌లు, 4,271 పరుగులు (12 సెంచరీలు, 21 అర్థసెంచరీలు).

• టీ20లు: 64 మ్యాచ్‌లు, 1522 పరుగులు (8 అర్థసెంచరీలు).

• టెస్టులు: 5 మ్యాచ్‌లు, 187 పరుగులు.

• ఐపీఎల్: 21 మ్యాచ్‌లు, 614 పరుగులు.

ప్రస్తుతం జేసన్ రాయ్ టీ20 లీగ్‌లలో ఓపెనర్‌గా భారీ డిమాండ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ టీమ్ అతడిని పక్కనపెట్టినా, అంతర్జాతీయ క్రికెట్‌లో జేసన్ రాయ్ ఒక మేటి బ్యాటర్‌గా తన ముద్ర వేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories