Virat Kohli : ఏమైనా తగ్గేదేలే.. కింగ్ కోహ్లీకి ఏమైంది? షాకింగ్ నిజాలు !

Published : Apr 16, 2026, 07:28 AM IST

Virat Kohli : జ్వరం, మోకాలి నొప్పితో బాధపడుతున్నా తగ్గేదేలే అంటున్నాడు విరాట్ కోహ్లీ. ఆరెంజ్ క్యాప్ అందుకున్న తర్వాత తన హెల్త్ కండిషన్‌పై షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం.

PREV
16
ఐదు రోజులుగా జ్వరం.. మోకాలి వాపు.. అయినా తగ్గేదేలే అంటున్న రన్ మెషీన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నారు. అయితే, ఈ మెరుపు ఇన్నింగ్స్‌ల వెనుక కోహ్లీ పడుతున్న శ్రమ, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిస్తే అభిమానులు షాక్‌కు గురవ్వాల్సిందే. గత ఐదు రోజులుగా జ్వరం, మోకాలి నొప్పితో బాధపడుతున్నా, జట్టు కోసం మైదానంలో పోరాడుతున్నానని కోహ్లీ స్వయంగా వెల్లడించారు.

26
ముంబై మ్యాచ్‌లో ఫైర్.. అసలు కారణం ఇదే

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశారు. అయితే తన స్థాయికి తగ్గట్టుగా వేగంగా ఆడలేకపోయానన్న అసహనం ఆయనలో కనిపించింది. అవుట్ అయిన తర్వాత డగౌట్‌లోకి వెళ్తూ కోపంతో హెల్మెట్, గ్లౌస్‌లను విసిరికొట్టారు. ఆ సమయంలో అభిమానులు కోహ్లీ ఎందుకు అంత కోపంగా ఉన్నారని చర్చించుకున్నారు. కానీ, ఆ సమయంలో ఆయన తీవ్రమైన జ్వరం, మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారని తాజాగా వెల్లడైంది. అనారోగ్యం కారణంగానే బ్యాటింగ్‌లో ఇబ్బంది పడటం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది.

36
లక్నోపై విజయం.. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్

బుధవారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇది బెంగళూరుకు నాలుగో విజయం. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 34 బంతుల్లో 49 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజెంటేషన్ వేడుకలో తన ఆరోగ్యంపై కోహ్లీ సంచలన విషయాలను పంచుకున్నారు.

46
తన హెల్త్ కండిషన్‌పై కోహ్లీ ఏమన్నారంటే?

ఆరెంజ్ క్యాప్ అందుకున్న తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. "గత మ్యాచ్‌తో పోలిస్తే ఇప్పుడు కొంచెం మెరుగ్గా అనిపిస్తోంది. కానీ నేను ఇంకా వంద శాతం ఫిట్‌గా లేను. గత మ్యాచ్‌లో నా మోకాలికి కొంచెం వాపు, నొప్పి ఉంది. అంతేకాకుండా గత నాలుగు, ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. నెమ్మదిగా కోలుకుంటూ నా అత్యుత్తమ ఫామ్‌లోకి వస్తున్నాను. ఈరోజు మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించింది, నా ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నాను. క్రీజులో ఉండి మ్యాచ్ ముగించాలనుకున్నాను, కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది" అని వివరించారు.

56
పరుగుల వేటలో నంబర్ వన్

అనారోగ్యంతో ఉన్నప్పటికీ కోహ్లీ పరుగుల వేటలో దూసుకుపోతున్నారు. లక్నోపై చేసిన 49 పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. సౌతాఫ్రికా వీరుడు హెన్రిక్ క్లాసెన్‌ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 57.00 సగటుతో, 158.33 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 228 పరుగులు చేశారు. ప్రస్తుతం క్లాసెన్ (224 పరుగులు) రెండో స్థానంలో, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (222 పరుగులు) మూడో స్థానంలో ఉన్నారు.

66
గాయపడినా గాండ్రిస్తున్న సింహం

విరాట్ కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ప్రాణమో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మోకాలి నొప్పి వేధిస్తున్నా, జ్వరం నీరసపరుస్తున్నా జట్టు విజయం కోసం ఆయన వెనకడుగు వేయలేదు. అనారోగ్యంలోనూ మైదానంలో ఆయన చూపుతున్న ఉత్సాహం కుర్ర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. కింగ్ కోహ్లీ త్వరగా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించాలని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. గాయపడినా విరాట్ ఎంత ప్రమాదకారి అన్నది ప్రత్యర్థి జట్లకు ఆరెంజ్ క్యాప్ రూపంలో అర్థమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories