IPL 2026 ట్రేడ్ విండోలో ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్‌లపై వస్తున్న ఊహాగానాలు.. క్లాసెన్‌ను SRH వదులుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు..
IPL 2026 ట్రేడ్ విండో ప్రారంభం కాకముందే పలు ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీలపై గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఈ వార్తలపై ఎంత నిజముందో.. లేదో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ కోసం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడుతున్నాయి.
25
ముంబైతో ట్రేడ్
SRH కిషన్‌ను వదులుకుంటే, మిడిల్ ఆర్డర్ బలోపేతం కోసం ముంబై నుంచి తిలక్ వర్మ వంటి ఆటగాడిని SRH అడిగే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఇషాన్ కిషన్ కోసం ఆసక్తి చూపుతోంది. వారికి గత కొన్ని సీజన్లుగా ఓపెనింగ్, వికెట్ కీపింగ్ సమస్యలు ఉన్నాయి. KKR SRHకి క్యాష్ ట్రేడ్ ఆఫర్ చేసినప్పటికీ, SRH బదులుగా అంగ్రిష్ రఘువంశీ, రమణ్ దీప్ సింగ్ లేదా రింకూ సింగ్ వంటి కీలక ఆటగాళ్లను అడుగుతున్నట్లు సమాచారం. KKR ఈ ఆటగాళ్లను వదులుకోవడానికి సుముఖంగా లేదు.
35
ఇషాన్ కిషన్ కోసం పోటీ
ఇషాన్ కిషన్ కోసం పోటీ పడుతున్న మూడవ జట్టు రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ RR నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం అయినందున, అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని చూస్తోంది RR ఫ్రాంచైజీ. RR ప్లేయర్ ప్లస్ క్యాష్ లేదా ప్లేయర్ స్వాప్ రెండింటికీ సిద్ధంగా ఉంది. SRH మాత్రం ఇషాన్ కిషన్‌కు బదులుగా సంజూ శాంసన్‌ను అడుగుతోంది. శాంసన్ జట్టులోకి వస్తే, పాట్ కమిన్స్ తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని, అతని ఫ్యాన్ బేస్ SRH బ్రాండ్ విలువను పెంచుతుందని భావిస్తోంది.
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్పిన్నర్ కోసం చూస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్ ఆఫర్ చేసింది. అయితే దీనికి గుజరాత్ టైటాన్స్ ఒప్పుకోలేదని టాక్. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను విడుదల చేస్తుందని ఓ వార్త హల్చల్ చేస్తోంది.
55
క్లాసెన్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్
SRH అతనికి మెగా వేలంలోకి వదులుకుని.. మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడం లేదా.. కామెరాన్ గ్రీన్ వంటి స్టార్ ఆల్ రౌండర్ కోసం ప్రయత్నిస్తుందని కొందరు వాదిస్తున్నారు. అంతేకాదు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, క్లాసెన్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లను వదులుకుంటే 50 కోట్ల పర్స్ తో వేలంలోకి వెళ్ళవచ్చని చూస్తోందట.