ఐపీఎల్ 2026లో బిగ్ ట్రేడ్స్.. SRHకి కుల్దీప్, కేకేఆర్‌కి రాహుల్.. ఇంకా మరెన్నో

Published : Nov 04, 2025, 07:14 PM IST

IPL 2026: రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం పలు కీలక ట్రేడ్ వార్తలు, కోచింగ్ మార్పులు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. సంజూ శాంసన్ DCకి ట్రేడ్, KKR కేఎల్ రాహుల్ కోసం ప్రయత్నాలు, LSG యువరాజ్ సింగ్‌ను కోచ్‌గా నియమించే యోచన.. ఇంకా మరెన్నో

PREV
15
ఐపీఎల్ మినీ వేలం కోసం..

రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్న తరుణంలో ప్లేయర్ ట్రేడ్‌లు, కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంఛైజీలు తమ వ్యూహాలను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. నవంబర్ నెలలో ప్లేయర్ రిటెన్షన్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతుండటంతో రాబోయే రోజుల్లో పలు సంచలన వార్తలు హల్చల్ అవకాశం ఉంది.

25
సంజూ ట్రేడ్ డీల్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ చేయడానికి దాదాపు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సంజూ 18 కోట్ల ఆటగాడు కాగా, అతడి స్థానంలో స్టబ్స్, మరో అన్ క్యాప్ద్ దక్షిణాఫ్రికా ఆటగాడి కోసం రాజస్థాన్ రాయల్స్ అడుగుతోందని సమాచారం.

35
కేకేఆర్ హెడ్ కోచ్‌గా నాయర్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం KKR వికెట్ కీపింగ్ కెప్టెన్ కోసం చూస్తున్నందున, కేఎల్ రాహుల్‌ను తమ జట్టులోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ సంజూ శాంసన్ ఢిల్లీకి వెళ్తే, ఈ పరిస్థితుల్లో KKR ఒక భారీ ఆఫర్‌తో ముందుకు వస్తే రాహుల్‌ను వదులుకోవడానికి ఢిల్లీ కూడా ఆలోచించదని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కోసం ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లను సైతం ట్రేడ్‌లో ఇచ్చేందుకు KKR సిద్ధంగా ఉంది.

45
లక్నోలో మార్పులు..

లక్నో సూపర్ జెయింట్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పులు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న జస్టిన్ లాంగర్ స్థానంలో టీమ్ ఇండియా దిగ్గజం యువరాజ్ సింగ్‌ను కోచ్‌గా నియమించే అవకాశాలను LSG పరిశీలిస్తోంది. యువరాజ్ సింగ్‌తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యువరాజ్ సింగ్ గతంలో ఏ జట్టు కోచింగ్ స్టాఫ్‌లోనూ పనిచేయలేదు. పంత్, యువరాజ్ కాంబినేషన్‌లో కొత్త LSGని చూడవచ్చని అంచనా వేస్తున్నారు.

55
SRHకి కుల్దీప్ యాదవ్.?

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తమ జట్టులోకి చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కెప్టెన్ పాట్ కమిన్స్ స్వయంగా కుల్దీప్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. గత సీజన్‌లో సన్‌రైజర్స్ స్పిన్ బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్‌ను వదులుకోవడానికి సుముఖంగా లేదు. గత కొన్ని సీజన్లుగా అతను ఢిల్లీకి కీలక ఆటగాడిగా మారాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ కాంబినేషన్ ఢిల్లీ బౌలింగ్‌కు బలం. ఒకవేళ ట్రేడ్ చేయాల్సి వస్తే, ఢిల్లీ ఒక ఎక్స్‌ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాటర్‌ను డిమాండ్ చేసే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories