CSK టాప్ ఆర్డర్ చూస్తేనే హడల్.. ఐపీఎల్ కా బాప్ ఈజ్ బ్యాక్ అని అనాల్సిందే..

Published : Nov 04, 2025, 05:50 PM IST

CSK: సీఎస్కే ఐపీఎల్ 2026 సీజన్ కోసం యువ ఆటగాళ్లపై దృష్టి సారించి జట్టును పాక్షికంగా పునర్నిర్మిస్తోంది. దాదాపు 10 మందిని విడుదల చేసి, టాప్ ఆర్డర్‌లో మార్పులు చేయనుంది. 

PREV
15
CSK వ్యూహం ఇదేనా..

నవంబర్ 15వ తేదీన ఐపీఎల్ ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్ ప్రకటించడానికి లాస్ట్ డేట్. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2026 సీజన్ కోసం తమ వ్యూహాలను సిద్దం చేస్తోంది. 2025 సీజన్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన తర్వాత, సీఎస్కే మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉంది. 2025 సీజన్‌లో అంతగా రాణించని సామ్ కరన్, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వేలను సీఎస్కే విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

25
10 మంది ప్లేయర్స్ రిలీజ్

వేలంలో ఎప్పుడూ సీఎస్కే దృష్టి జట్టు భవిష్యత్తుపైనే ఉంటుంది. ఎంఎస్ ధోని మార్క్ ఎంపికలు తిరుగులేనివని అంటుంటారు. జట్టుకు ఉపయోగపడరని భావించినప్పుడే సీఎస్కే ఆటగాళ్లను విడుదల చేస్తుంది. లేకపోతే వారికి మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుత నివేదికల ప్రకారం.. సీఎస్కే ఈ సీజన్‌లో సుమారు 10 మంది ఆటగాళ్లను విడుదల చేసి, యువకులకు ప్రాధాన్యతనిస్తూ జట్టును పాక్షికంగా పునర్నిర్మించాలని చూస్తోంది.

35
టాప్ 3 ఫిక్స్

టాప్ ఆర్డర్‌లో యువ ద్వయం ఆయుష్ మ్హాత్రే, ఉర్విల్ పటేల్ రాకతో జట్టులో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రస్తుతం ఆయుష్ మ్హాత్రే, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్‌లతో టాప్-3 స్థిరంగా ఉంది. దీంతో డెవాన్ కాన్వేకు స్థానం కష్టమని, విడుదల చేస్తారని తెలుస్తోంది. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో డెవాల్డ్ బ్రెవిస్(నెంబర్ 4), శివమ్ దూబే(నెంబర్ 5), రవీంద్ర జడేజా (నెంబర్ 6), ఎం.ఎస్. ధోని (నెంబర్ 7) లైనప్ స్థిరంగా ఉంది.

45
బ్యాకప్ ఫినిషర్ కోసం వేట

అయితే బ్యాకప్‌లు, మ్యాచ్‌లను ముగించగలిగే ఒక మంచి విదేశీ ఫినిషర్ జట్టుకు అవసరం ఉంది. ఎందుకంటే జడేజా, ధోని గత సీజన్‌లో కొన్నిసార్లు మ్యాచ్‌లను ముగించలేకపోయారు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లు జట్టుకు ఉపయోగపడరని యాజమాన్యం భావిస్తోంది.

55
సుందర్ ట్రేడ్‌పై సస్పెన్స్

నెంబర్ 8లో ఆడే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని స్థానంలో సీఎస్కే వాషింగ్టన్ సుందర్‌ను ట్రేడింగ్‌లో పొందాలని చూస్తోంది. అలాగే లోయర్ ఆర్డర్‌లో ఆడగలిగే మంచి ప్లేయర్ అవసరం. 9, 10, 11 స్థానాలకు ఖలీల్ అహ్మద్, మతీశ పతిరన, నూర్ అహ్మద్‌లు ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా యువ అన్షుల్ కంబోజ్‌ను చేర్చుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories