పోటుగాళ్లను ఉంచి దద్దమ్మలను వదిలేస్తున్న RCB.. లిస్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Nov 04, 2025, 06:15 PM IST

RCB: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2026లో దానిని నిలబెట్టుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో, జట్టు తమ అద్భుతమైన టాప్ ఆర్డర్‌ను నిలుపుకోవాలని చూస్తుండగా, కొన్ని కీలక ఆటగాళ్లను ప్రదర్శన ఆధారంగా.. 

PREV
15
టైటిల్ ను నిలబెట్టుకోవడం ఆర్సీబీకి సవాల్

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే, రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ లో కూడా టైటిల్ ను నిలబెట్టుకోవడం ఆర్సీబీకి అతిపెద్ద సవాల్ గా మారింది. గత ఐదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా వరుసగా రెండు సీజన్లలో టైటిల్స్ గెలవలేదు.

25
ఆర్సీబీ టాప్ ఆర్డర్ బలం

ప్రస్తుతం ఉన్న ఆర్సీబీ జట్టు అత్యంత సమతుల్యంగా ఉంది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ద్వయం ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ ను కొనసాగించే అవకాశం ఉంది. అలాగే, స్వస్తిక్ చికారా వంటి ప్రతిభావంతులైన యువకులు జట్టులో ఉన్నందున, మయాంక్ అగర్వాల్ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు.

35
హార్డ్ హిట్టింగ్ ఫినిషర్లు అందుబాటులో

నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్ కొనసాగుతాడు. ఐదో స్థానంలో ఆడిన లియామ్ లివింగ్‌స్టోన్ పై ఆర్సీబీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, అతని ప్రదర్శన అంచనాలను అందుకోలేకపోయింది. రొమారియో షెపర్డ్ వంటి హార్డ్ హిట్టర్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం ఇవ్వవచ్చు. ఫినిషింగ్ లో జిగేష్ శర్మ, టిమ్ డేవిడ్ వంటి హార్డ్ హిట్టింగ్ ఫినిషర్లు అందుబాటులో ఉన్నారు.

45
బౌలింగ్ లో ఫైర్

ఎనిమిదో స్థానంలో కృనాల్ పాండ్యా బ్యాటింగ్ డెప్త్ ను అందిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ల ఫాస్ట్ బౌలింగ్ ద్వయం గత సీజన్ లో అద్భుతంగా రాణించింది. అయితే కొంతమంది ప్లేయర్స్ విడుదల ఖాయం అని అనిపిస్తోంది. యష్ దయాల్ ను ఆర్సీబీ విడుదల చేసే అవకాశం ఉంది. కారణం అతడికి మైదానం వెలుపల వచ్చిన వివాదాలు.

55
వీరి రిలీజ్ కచ్చితమే..

తాత్కాలిక రీప్లేస్‌మెంట్స్ గా వచ్చిన టిమ్ సౌథీ, బ్లెస్సింగ్ ముజారాబానిలను ఐపీఎల్ నిబంధనల ప్రకారం రీటైన్ చేసుకోవడం కుదరదు. స్వప్నిల్ సింగ్, రసిక్ సలామ్ దార్, మోహిత్ రాఠీ, అభినవ్ సింగ్, మనోజ్ భాండగే వంటి అన్ క్యాప్డ్ ఆటగాళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. నువాన్ తుషారా, లుంగి ఎంగిడి వంటి విదేశీ ఆటగాళ్లను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories