IPL 2026: ఐపీఎస్ 2026కి ఇప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సోమవారం ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించారు. అయితే ఈ వేలంలో కరీంనగర్‌కు చెందిన అమన్‌రావు అనే యువకుడు ఎంపిక కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవరతను, అతని ప్రయాణం ఏంటో చూద్దాం.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన పేరాల అమన్‌రావు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఎంపికయ్యాడు. అబుదాబిలో మంగళవారం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది. జిల్లాకు చెందిన కుర్రాడు తొలిసారి ఐపీఎల్‌కు ఎంపిక కావడం హాట్ టాపిక్‌గా మారింది.
25
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు
అమన్‌రావు టాప్ ఆర్డర్‌లో దూకుడైన ఆటతీరుతో పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అండర్–19, అండర్–23 స్థాయిలో స్థిరమైన ప్రదర్శన చూపించాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు తరఫున అండర్–23 విభాగంలో దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు.
35
ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా
అండర్–23 ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నీలో అమన్‌రావు ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు ఆడాడు. సుమారు 160 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 9 అర్ధశతకాలు నమోదు చేశాడు. మొత్తం స్కోరు 250కు పైగా ఉండటం అతడి సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.
అమన్‌రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టులో సభ్యుడిగా జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. ఆ క్రీడా వాతావరణం అమన్‌రావు ఎదుగుదలకు దోహదపడింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో రాణించి కరీంనగర్ జిల్లా పేరు దేశవ్యాప్తంగా వినిపించాలని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
55
పాస్‌పోర్ట్ సమస్యకు తక్షణ పరిష్కారం
వేలంలో పాల్గొనే సమయంలో అమన్‌రావుకు పాస్‌పోర్ట్ లేకపోవడం అడ్డంకిగా మారింది. ఈ విషయం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ దృష్టికి వెళ్లగానే వెంటనే స్పందించారు. ఒక్క రోజులో పాస్‌పోర్ట్ జారీ అయ్యేలా సహకరించడంతో అమన్‌రావు వేలంలో పాల్గొనగలిగాడు.