వామ్మో.! ఈ ఏడుగురు ప్లేయర్స్‌కు భారీ పోటీ తప్పేలా లేదుగా.. ఆర్సీబీ టార్గెట్స్ వీరే..

Published : Dec 15, 2025, 05:34 PM IST

RCB: 2026 ఐపీఎల్ వేలం కోసం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తమ వ్యూహాలను సిద్దం చేశాయి. డిసెంబర్ 16న దుబాయ్‌లో జరిగే ఈ మినీ వేలంలో ఈ రెండు జట్లు ఏయే ప్లేయర్స్‌ను టార్గెట్ చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం.. 

PREV
15
మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్దం..

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్‌లో జరగనుంది. ఈ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తమ స్క్వాడ్‌లను బలోపేతం చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలను రచించనున్నాయి. ఏయే ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు అనేది చూసేద్దాం.

25
గుజరాత్ టైటాన్స్ లక్ష్యాలు ఇవే..

గుజరాత్ టైటాన్స్ తమ బలమైన కోర్ టీంను అట్టిపెట్టుకుంది. రూ. 12.9 కోట్లతో వేలంలోకి వస్తోన్న గుజరాత్.. ఐదు స్లాట్‌లు(నాలుగు ఓవర్సీస్ స్లాట్‌లతో సహా) భర్తీ చేయాలి. ఓవర్సీస్ బ్యాట్స్‌మెన్, ఓవర్సీస్ ఆల్ రౌండర్, ఓవర్సీస్ పేస్ బౌలర్ కోసం ఈ ఫ్రాంచైజీ వేలంలో పోటీ పడే అవకాశం ఉంది. డేవిడ్ మిల్లర్, జాసన్ హోల్డర్, స్పెన్సర్ జాన్సన్ లేదా రీస్ టోప్లే లాంటి ప్లేయర్స్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది.

35
లిస్టులో ఇంకా స్టార్ ప్లేయర్స్..

గుజరాత్ లిస్టు ఇంకా అయిపోలేదు. వీరితో పాటు జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా, మాట్ హెన్రీ కోసం కూడా పోటీ పడే ఛాన్స్ ఉంది. అలాగే ఇండియన్ ప్లేయర్ స్లాట్ ఒకటి ఉండటంతో.. దాని కోసం పెద్దగా వ్యూహాలు పెట్టకపోవచ్చు. ముఖ్యంగా ఓవర్సీస్ ప్లేయర్‌ల పైనే దృష్టి సారించవచ్చు గుజరాత్ టైటాన్స్.

45
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్ష్యాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోర్ టీంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిం డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఆర్సీబీ వద్ద రూ. 16.4 కోట్ల పర్స్ ఉంది. ఎనిమిది స్లాట్‌లను(రెండు ఓవర్సీస్ స్లాట్‌లతో సహా) భర్తీ చేయాల్సి ఉంది. రజత్ పాటిదార్ కూడా ఇంకా కోలుకుంటున్నాడు.

55
ఆర్సీబీ ప్రధాన లక్ష్యాలు వీరే..

ఆర్సీబీ ప్రధానంగా బ్యాకప్ ఆటగాళ్ల కోసం ప్రయత్నిస్తుంది. వ్రిస్ట్ స్పిన్నర్, ఓవర్సీస్ ఆల్ రౌండర్, బ్యాకప్ పేస్ బౌలర్, అలాగే భారతీయ బ్యాట్స్‌మెన్/ఆల్ రౌండర్‌ల కోసం చూస్తోంది. సుయాష్ శర్మ స్థానంలో లేదా బ్యాకప్‌గా రవి బిష్ణోయ్, విఘ్నేష్ పూతూర్, లేదా రాహుల్ చాహర్ వంటి స్పిన్నర్‌లను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఓవర్సీస్ ఆల్ రౌండర్‌ల కోసం కామెరాన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, లాంటి ఆటగాళ్లను ఆర్సీబీ పరిగణలోకి తీసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories