ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా 13 వేదికల్లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సిరీస్ 18వ సీజన్ కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, అహ్మదాబాద్, గౌహతి, ముంబై, లక్నో, బెంగళూరు, చండీగఢ్, జైపూర్, ఢిల్లీ, ధర్మశాల వంటి 13 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ 13 వేదికల్లోనే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.