జియోహాట్‌స్టార్‌లో 'సూపర్‌స్టార్స్' షోలో అయ్యర్ మాట్లాడుతూ, "నేను మా ఏరియాలో వీధి క్రికెట్ ఆడుతూ పెరిగాను. ఆ టైమ్‌లో నేను ముంబై అండర్-14 టీమ్‌కు ఆడుతున్నాను. ముంబై టీమ్‌లోని పిల్లలందరినీ బాల్ బాయ్స్‌గా వాడుకునేవాళ్లు. ఐపీఎల్‌ను దగ్గర నుంచి చూడటం అదే నాకు మొదటిసారి. నేను సిగ్గుపడుతూ, దూరంగా ఉండేవాడిని. కానీ నేను వాళ్లలో ఒకడిగా ఉండటం అదృష్టం. నా ఫ్రెండ్స్ ప్లేయర్స్‌తో మాట్లాడటం చూసి, నేను కూడా ట్రై చేద్దామనుకున్నా.