Abhinav Bindra: ఒలింపిక్ అత్యున్న పుర‌స్కారం అందుకున్న భార‌త షూట‌ర్ అభినవ్ బింద్రా

First Published | Aug 10, 2024, 11:42 PM IST

Olympic Order Award : ఒలింపిక్ పతక విజేత, భార‌త స్టార్ షూటర్ అభినవ్ బింద్రాను పారిస్‌లో 'ఒలింపిక్ ఆర్డర్ అవార్డు'తో సత్కరించారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు బింద్రా. ప్ర‌స్తుతం ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నారు.
 

Olympic Order Award - Abhinav Bindra : భార‌త స్టార్ షూట‌ర్ అభిన‌వ్ బింద్రా ఒలింపిక్ అత్యున్న‌త పుర‌స్కారం అందుకున్నారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచి బింద్రా 'ఒలింపిక్ ఆర్డ‌ర్' అవార్డును అందుకున్నారు. 

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భార‌త‌ మాజీ షూటర్ అభినవ్ బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ అవార్డును పారిస్ లో శ‌నివారం అందజేసింది. ఒలింపిక్ క్యాంపెయిన్‌లో ఆయన చేసిన విశేష కృషికి గానూ ఈ అవార్డును అందుకున్నారు. 

Latest Videos


మాజీ షూటర్ అభినవ్ బింద్రా 2008లో భార‌త్ తరఫున వ్యక్తిగత షూటింగ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. ప్రొఫెష‌న్ షూటింగ్ నుండి రిటైర్ అయిన తరువాత, అభినవ్ బింద్రా యువ అథ్లెట్లను ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. క్రీడలు, ముఖ్యంగా అథ్లెటిక్స్ అభివృద్ధికి గణనీయమైన కృషి చేసారు. 

ఈ క్ర‌మంలోనే క్రీడలకు అంకితమైన అభినవ్ బింద్రాను పారిస్ ఒలింపిక్స్ 2024లో ఐఓసీ ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించింది. అభినవ్ బింద్రాకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. ఎందుకంటే ఈ అవార్డుతో గౌరవించబడిన రెండవ భారతీయుడు అతను మాత్రమే. 41 ఏళ్ల క్రితం భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఈ అవార్డు లభించింది. 1983లో ముంబైలో జరిగిన అవార్డు వేడుకలో ఇందిరా గాంధీకి ఈ అవార్డును అందుకున్నారు.

ఒలింపిక్ ఆర్డర్ అవార్డును 1975లో తీసుకువ‌చ్చారు. ఇది ఒలింపిక్ ఉద్యమంలో అత్యున్నత పురస్కారం. ఇది ఒలింపిక్ గేమ్స్ కోసం, క్రీడ‌ల కోసం విశేష కృషి చేసిన వారికి అందిస్తున్నారు.  ఇంతకుముందు ఈ అవార్డును గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అనే మూడు విభాగాల్లో అందించారు. కానీ 1984 నుంచి క్రీడ‌ల‌కు ప్రత్యేక కృషి చేసిన దేశాధినేత‌లు, వ్యక్తులకు గోల్డ్ విభాగంలో ఒలింపిక్ ఆర్డ‌ర్ అవార్డును అందిస్తున్నారు. 

click me!