పీవీ సింధు గురించి ఈ విషయాలు మీకు తెలుసా... అక్క పెళ్లికి కూడా రాకుండా...

First Published | Jul 4, 2022, 11:19 PM IST

భారతదేశంలో వుమెన్ బ్యాడ్మింటన్ ఆటకు గుర్తింపు తెచ్చింది సైనా నెహ్వాల్ అయితే, దానికి క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం తెలుగమ్మాయి పీవీ సింధునే. 1995, జూలై 5న హైదరాబాద్‌లో జన్మించిన పూసర్ల వెంకట సింధు, 27వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పీవీ సింధు గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు...

పీవీ సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం వాలీబాల్ ప్లేయర్లు కావడం విశేషం. సింధు తండ్రి పీవీ రమణ, తల్లి పీ విజయ.. నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్లు...

1986లో సియోల్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత వాలీబాల్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు సింధు తండ్రి పీవీ రమణ. వాలీబాల్‌ ఆటకు ఆయన చేసిన సేవలకు కారణంగా 2000వ సంవత్సరంలో అర్జున అవార్డు కూడా అందుకున్నారు...
 


బ్యాడ్మింటన్‌ని కెరీర్‌గా మలుచుకున్న పీవీ సింధు, 2012లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొవడానికి తన అక్క పెళ్లికి హాజరుకాలేకపోయింది. ఆ సమయంలో లక్నోలో ఉన్న పీవీ సింధు, హైదరాబాద్‌లో జరిగిన సోదరి వివాహ వేడుకకు రాలేదు. అప్పుడు సింధు వయసు కేవలం 17 ఏళ్లే...

PV Sindhu

బ్యాడ్మింటన్‌ కోసం చిన్నతనంలోనే రోజూ 120 కి.మీ.ల దూరం ప్రయాణించేది పీవీ సింధు. సింధు ఇంటి నుంచి 60 కి.మీల దూరంలో పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉండేది. దీంతో 7 గంటలకు ట్రైనింగ్‌కి వెళ్లేందుకు ఉదయం 3 గంటలకు నిద్రలేచి ట్రైన్ ఎక్కేది పీవీ సింధు... 

PV Sindhu

పీవీ సింధుకి ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా నేతితో చేసిన స్వీట్లు అంటే ప్రాణం. అయితే ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే కల కోసం కొన్నేళ్ల పాటు తనకి ఇష్టమైన స్వీట్లను తినడం మానేసింది పీవీ సింధు...

PV Sindhu

పీవీ సింధుకి సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం అంటే కూడా చాలా ఆసక్తి. అయితే 2016 రియో ఒలింపిక్స్‌కి ముందు ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్, సింధు మొబైల్ ఫోన్‌ని లాగేసుకున్నాడు. దాదాపు 3 నెలల పాటు సింధు ఫోన్, గోపిచంద్ దగ్గరే ఉండింది. ఆమె పూర్తి ఫోకస్ ఆటపైనే ఉండాలనే ఉద్దేశంతో గోపిచంద్ అలా చేశాడు..

PV Sindhu

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. అదీకాకుండా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఆసియా గేమ్స్, ఆసియా ఛాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట పండించిన పీవీ సింధు... ఈ ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్వీస్ ఓపెన్ 2022 టోర్నీలను గెలిచింది. 

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుందని వార్తలు వినిపించాయి. తన బయోపిక్ రూపొందితే ఆ పాత్రకు దీపికా అయితేనే సెట్ అవుతుందని పీవీ సింధు కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది... 

సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇచ్చే పీవీ సింధు, తెలంగాణ పండుగలు బోనాలతో పాటు బతుకమ్మ పండగల్లోనూ పాల్గొంటుంది...

Latest Videos

click me!