మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు, విరాట్ అలా ఉంటేనే బాగుంటుంది.. జానీ బెయిర్‌స్టో కామెంట్...

Published : Jul 04, 2022, 09:59 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో విజయం కోసం ఇరుజట్లు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఆటలో మొదటి మూడు రోజులు టీమిండియా ఆధిపత్యమే కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, 284 పరుగులు చేయగలిగిందంటే దానికి జానీ బెయిర్‌స్టో సెంచరీ ఇన్నింగ్సే కారణం...

PREV
18
మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు, విరాట్ అలా ఉంటేనే బాగుంటుంది.. జానీ బెయిర్‌స్టో కామెంట్...
Image Credit: Getty Images

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ హాఫ్ సెంచరీ అందుకోవడానికి విఫలమైన చోట జానీ బెయిర్‌స్టో 140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసి, వరుసగా మూడో టెస్టులో హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేశాడు...

28
Image Credit: Getty Images

ఈ ఏడాది ఐదు సెంచరీలు చేసి, ఐదు అంతకంటే కింది బ్యాటింగ్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ ఒకే ఏడాదిలో ఐదు సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జానీ బెయిర్‌స్టో. ఇంతకుముందు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రమే ఈ ఫీట్ సాధించగలిగాడు...

38

అయితే ఆట మూడో రోజు జానీ బెయిర్‌స్టో, భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ మధ్య ఓ మినీ మాటల యుద్ధం నడిచింది. మహ్మద్ షమీ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఏదో సాకు చెప్పి, ఆఖరి సెకన్లలో ఆపాడు జానీ బెయిర్‌స్టో. దానికి సీరియస్ అయిన విరాట్ కోహ్లీ... ‘నీకు బాల్ తప్ప మిగిలివన్నీ స్పష్టంగా కనిపిస్తాయి...’ అంటూ సెడ్జ్ చేశాడు...

48

ఈ మాటలకు జానీ బెయిర్‌స్టో కూడా ఏదో మాట అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, అంపైర్లు కలుగుచేసుకుని ఇద్దరినీ వారించారు. అయితే ఈ సంఘటన తర్వాతే జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది...

58
Image credit: Getty

అప్పటిదాకా 64 బంతులు ఆడి 16 పరుగులు మాత్రమే చేసిన జానీ బెయిర్‌స్టో, దూకుడు పెంచి వరుస బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 76 బంతుల్లో 90 పరుగులు చేసి.. అవుట్ అయ్యాడు... ఈ ట్రోలింగ్‌పై క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద చర్చే జరిగింది.

68
Image Credit: Getty Images

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీశమ్, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ కూడా విరాట్ కోహ్లీ సెడ్జ్ చేయడం వల్లే జానీ బెయిర్‌స్టో కోపంతో వేగంగా ఆడాడని విమర్శించారు. పూజారా ఆడుతున్నవాడిని సెడ్జ్ చేసి, రిషబ్ పంత్‌లా ఆడేలా చేశావంటూ కోహ్లీని తిడుతూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

78

సెంచరీ చేసిన జానీ బెయిర్‌స్టోని విరాట్ కోహ్లీతో చప్పట్లతో అభినందించగా... మహ్మద్ షమీ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ని అందుకుని ప్లైయింగ్ కిస్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్‌ని పెవిలియన్ చేర్చాడు విరాట్ కోహ్లీ. ఈ మొత్తం ఎపిసోడ్‌పై మూడో రోజు ఆట ముగిసిన తర్వాత స్పందించాడు జానీ బెయిర్‌స్టో...

88
Virat Kohli, Jonny Bairstow

‘నాకు, విరాట్ కోహ్లీకి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేం ప్రత్యర్థులుగా ఆడుతున్నాం అంతే. విరాట్ కోహ్లీ ప్రతీ మ్యాచ్ ఎంతో ప్యాషన్‌తో ఆడతాను. అదే అతన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు పైచేయి సాధించడానికి ఏం చేయడానికైనా వెనకాడరు. అది అక్కడి వరకే ఉంటుంది.. విరాట్ అలా ఉంటేనే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు జానీ బెయిర్‌స్టో...

Read more Photos on
click me!

Recommended Stories