India vs New Zealand : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. కివీస్‌పై జస్ప్రీత్ బుమ్రా పేలవ గణాంకాలు టీమిండియాను కలవరపెడుతున్నాయి. ఫైనల్ లో బుమ్రా మ్యాజిక్ పనిచేయదా? అసలు కారణం ఏమిటి?
టీ 20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు టీమిండియా అభిమానుల ఆందోళన
క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం, మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. కోట్లాది మంది అభిమానులు టీమిండియా విజయం కోసం ప్రార్థిస్తుంటే, గణాంకాలు మాత్రం భారత జట్టును కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా రికార్డులు కివీస్‌పై ఆశాజనకంగా లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
26
IND vs NZ : ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మహా సంగ్రామం
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లో ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. మరోవైపు, దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కివీస్ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. చరిత్రను పునరావృతం చేయాలని భారత్, సరికొత్త చరిత్ర సృష్టించాలని న్యూజిలాండ్ ఆరాటపడుతున్నాయి.
36
సాంట్నర్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ గుండె పగులుతుందా?
ఫైనల్ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఆదివారం నాడు భారత అభిమానుల హృదయాలను పగలగొట్టి అయినా సరే, మేము ప్రపంచకప్ గెలవాలనుకుంటున్నాము. ఇందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత బౌలింగ్ విభాగంపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని, ముఖ్యంగా బుమ్రా గణాంకాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఆయన పరోక్షంగా సూచించారు.
జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు. కానీ, న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే ఆయన మ్యాజిక్ అంతగా పనిచేయడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. మూడు ఫార్మాట్లలోనూ కివీస్‌పై బుమ్రా రికార్డులు ఆయన కెరీర్ సగటు కంటే దారుణంగా ఉన్నాయి. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 254 పరుగుల ఛేదనలో బ్యాటర్లు విరుచుకుపడుతున్నా, బుమ్రా మాత్రం 4 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడి చేశారు. అయితే, ఇదే జోరు న్యూజిలాండ్‌పై కొనసాగడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
56
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా కెరీర్ సగటు 18.57గా ఉంది. కానీ న్యూజిలాండ్‌పై ఇది ఏకంగా 23.37కు చేరుకుంటుంది. ఆయన కెరీర్ స్ట్రైక్ రేట్ 17.0 కాగా, కివీస్‌పై 19.8గా నమోదైంది. ఎకానమీ రేటు విషయంలోనూ బుమ్రా సాధారణంగా 6.55 పరుగులు ఇస్తుంటే, న్యూజిలాండ్ బ్యాటర్లు ఆయన బౌలింగ్‌లో ఓవర్‌కు 7.05 పరుగులు రాబడుతున్నారు. కేవలం టీ20ల్లోనే కాకుండా టెస్టులు, వన్డేల్లో కూడా కివీస్‌పై బుమ్రా ప్రభావం తక్కువగానే ఉంది.
66
ఫైనల్‌లో బుమ్రా మ్యాజిక్ అవసరం
భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలవాలంటే, ఈ గణాంకాలను బుమ్రా తిరగరాయాల్సిందే. కివీస్ బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఏమాత్రం భయపడటం లేదని, పైగా వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందని స్పష్టమవుతోంది. మరి నరేంద్ర మోదీ స్టేడియంలో బుమ్రా తన పాత రికార్డులను చెరిపివేసి టీమిండియాకు కప్పు అందిస్తారో లేదో చూడాలి.