IND vs ENG : టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్ ! ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా

Published : Mar 05, 2026, 10:22 PM IST

IND vs ENG : టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ 253 పరుగులు చేసి నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. 19 సిక్సర్లతో పాటు పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

PREV
16
రికార్డుల అరాచకం.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఉతికి ఆరేసిన టీమిండియా

టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ రికార్డుల పుస్తకాన్ని తిరగరాసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ బౌలర్లను దంచి కొట్టిన భారత బ్యాటర్లు, టీ20 క్రికెట్ చరిత్రలో పలు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు.

26
నాకౌట్ చరిత్రలో అత్యధిక స్కోరు

ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన 253/7 స్కోరు, టీ20 ప్రపంచ కప్ నాకౌట్ (సెమీఫైనల్ లేదా ఫైనల్) చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది. అంతకుముందు 2012 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చేసిన 205 పరుగులే అత్యధికంగా ఉండేది. టీ20 ప్రపంచ కప్ ఓవరాల్‌గా ఇది నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం.

36
సిక్సర్ల సునామీ.. పలు రికార్డు సమం

ఈ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఏకంగా 19 సిక్సర్లు బాదారు. టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో ఒక జట్టు బాదిన అత్యధిక సిక్సర్ల రికార్డును (19) భారత్ సమం చేసింది. గతంలో నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అంతేకాకుండా, ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా (88 సిక్సర్లు) భారత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది.

46
వేగవంతమైన 100 పరుగులు

భారత జట్టు కేవలం 8.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక జట్టుకు ఇది రెండో వేగవంతమైన వంద పరుగులు. నిన్న జరిగిన సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 7.5 ఓవర్లలోనే వంద పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు నెలకొల్పిన 97 పరుగుల భాగస్వామ్యం, టీ20 వరల్డ్ కప్ నాకౌట్లలో భారత్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.

56
వ్యక్తిగత రికార్డుల కూడా..

• సంజూ శాంసన్: 89 పరుగులు చేసిన సంజూ, టీ20 ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (89*) రికార్డును సమం చేశాడు.

• శివం దూబే: ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో మూడు సార్లు రనౌట్ అయిన రెండో బ్యాటర్‌గా ఎంఎస్ ధోనీ తర్వాత దూబే నిలిచాడు.

• అదిల్ రషీద్: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 సిక్సర్లు సమర్పించుకున్న మొదటి బౌలర్‌గా ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ రికార్డు సృష్టించాడు.

66
ND vs ENG : బౌండరీల మోత

ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 37 బౌండరీలు (18 ఫోర్లు, 19 సిక్సర్లు) సాధించింది. టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో ఇది రెండో అత్యధిక బౌండరీల కౌంట్. 2007లో కెన్యాపై శ్రీలంక సాధించిన 41 బౌండరీల రికార్డు ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. భారత జట్టు తన ఇన్నింగ్స్‌లో ప్రతి 10.8 బంతులకు ఒక సిక్సర్ బాదుతూ ఈ టోర్నీలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అవతరించింది.

Read more Photos on
click me!

Recommended Stories