Asia Cup Hockey 2025: రాజ్‌గిర్‌లో ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ 3-2 తేడాతో జపాన్‌ను ఓడించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్, మన్ దీప్ సింగ్ ఒక గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ సూపర్ 4 లో స్థానం ఖాయం చేసుకుంది.
బీహార్‌లోని రాజ్‌గిర్ లో జరుగుతున్న మెన్స్ ఆసియా కప్ హాకీ 2025లో భారత్ తన రెండో పూల్ A మ్యాచ్‌లో జపాన్‌పై 3-2 తేడాతో విజయం సాధించింది. ఆదివారం రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ, 46వ నిమిషాలు) రెండు గోల్స్, మన్ దీప్ సింగ్ (4వ నిమిషం) ఒక గోల్ సాధించారు. జపాన్ తరఫున కోసే కావాబే (38వ, 59వ నిమిషాలు) రెండు గోల్స్ చేశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 4 దశకు అర్హత సాధించింది.
DID YOU KNOW ?
భారత్ తొలి ఆసియా కప్ హాకీ ట్రోఫీ
భారత పురుషుల హాకీ జట్టు తొలిసారిగా 2003లో ఆసియా కప్ హాకీ టైటిల్ గెలుచుకుంది. ఈ టోర్నమెంట్ మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగింది. ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను 4–2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భారత్ తన మొదటి ఆసియా కప్ హాకీ ట్రోఫీని గెలిచింది.
25
తొలి క్వార్టర్‌లో భారత్ ఆధిపత్యం
మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆటను మొదలుపెట్టింది. నాలుగో నిమిషంలో సుఖ్జీత్ సింగ్ అందించిన పాస్‌ను మన్ దీప్ సింగ్ గోల్‌గా మార్చాడు. వెంటనే వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. జపాన్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ సాధించినా, దాన్ని గోల్ గా మార్చలేకపోయింది.
35
రెండో క్వార్టర్‌లో జపాన్ ఫైట్
జపాన్ రెండో క్వార్టర్‌లో భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది. 19వ నిమిషంలో ర్యోసుకే షినోహరా చేసిన షాట్ తప్పింది. 24వ నిమిషంలో జపాన్ మరో పెనాల్టీ కార్నర్ పొందింది. కానీ జర్మన్‌ప్రీత్ అద్భుతంగా కాపాడాడు. భారత్ కూడా అర్ధభాగం ముగిసేలోపు మరో పెనాల్టీ కార్నర్ దక్కించుకుంది కానీ అమిత్ రోహిదాస్ టార్గెట్‌ను చేజార్చాడు.
38వ నిమిషంలో జపాన్ తరఫున కోసే కావాబే గోల్ చేసి స్కోరు 2-1కి చేరువ చేశాడు. ఆటలో జపాన్ దూకుడు పెంచినా, భారత్ తన పట్టును కోల్పోలేదు. 46వ నిమిషంలో భారత్ పెనాల్టీ కార్నర్ సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌కీపర్ కాళ్ల మధ్యగా బంతిని పంపి తన రెండో గోల్ ను సాధించాడు. దీంతో భారత్ 3-1 ఆధిక్యంలో నిలిచింది.
55
చివరి క్వార్టర్‌లో ఉత్కంఠ
చివరి క్వార్టర్‌లో జపాన్ గోల్ అవకాశాలు కోసం గట్టిగానే ప్రయత్నించింది. 49వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను భారత గోల్‌కీపర్ సూరజ్ కార్కెరా రెండు సార్లు అద్భుతంగా కాపాడాడు. 59వ నిమిషంలో జపాన్ ఆటగాడు కావాబే రీబౌండ్ బంతిని గోల్ చేసి స్కోరును 3-2కు తగ్గించాడు. చివరి నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్‌కు యెల్లో కార్డు రావడంతో భారత్ 10 మందితోనే ఆటను కొనసాగించింది. ఈ సమయంలో భారత జట్టు సమయాన్ని వృథా చేస్తూ ఆధిక్యాన్ని కాపాడుకుంది.
తర్వాతి మ్యాచ్‌లో కజకిస్తాన్ తో తలపడనున్న భారత్
జపాన్ పై విజయం తర్వాత భారత్ పూల్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను సెప్టెంబర్ 1, సోమవారం కజకస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఓటమి లేకుండా సూపర్ 4 దశలోకి ప్రవేశిస్తుంది.